92 అడుగులకు చేరిన ‘metturu’ నీటిమట్టం

ABN , First Publish Date - 2021-10-20T15:05:22+05:30 IST

కావేరి నీటి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా సేలం జిల్లా మేట్టూరు ప్రాంతంలోని డ్యాం నీటిమట్టం 92.44 అడుగులకు పెరిగిందని మంగళవారం ప్రజాపనుల శాఖ అధికారులు తెలిపారు. డెల్టా జిల్లా

92 అడుగులకు చేరిన ‘metturu’ నీటిమట్టం

ప్యారీస్‌(chennai): కావేరి నీటి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా సేలం జిల్లా మేట్టూరు ప్రాంతంలోని డ్యాం నీటిమట్టం 92.44 అడుగులకు పెరిగిందని మంగళవారం ప్రజాపనుల శాఖ అధికారులు తెలిపారు. డెల్టా జిల్లాల ప్రజలకు తాగునీరు, పంట పొలాలకు సాగు నీటి ఆధారంగా ఉన్న మేట్టూరు డ్యాం నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. డెల్టా సాగు కోసం సెకనుకు 100 ఘనపుటడుగుల నీటిని విడుదల చేస్తున్నారు. తూర్పు, పశ్చిమ కాలువల సాగుకు సెకనుకు 550 ఘనపుటడుగుల నీరు విడుదల చేస్తున్న నేపథ్యంలో, డ్యాంకు సెకనుకు 16,197 ఘనపుటడుగుల నీరు చేరుతోందని, సేలం జిల్లా సహా డెల్టా జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా డ్యాం నీటిమట్టాలు మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.

Updated Date - 2021-10-20T15:05:22+05:30 IST