మెట్రో రైల్వేస్టేషన్ల నుంచి మినీ బస్సు సేవలు

ABN , First Publish Date - 2022-06-12T15:17:08+05:30 IST

మెట్రో రైల్వేస్టేషన్ల నుంచి మినీ బస్సు సేవలు పరిచయం చేయనున్నట్లు చెన్నై మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (సీఎంఆర్‌ఎల్‌) తెలిపింది. మెట్రోరైలు ప్రయాణికుల సంఖ్య క్రమంగా

మెట్రో రైల్వేస్టేషన్ల నుంచి మినీ బస్సు సేవలు

చెన్నై, జూన్‌ 11: మెట్రో రైల్వేస్టేషన్ల నుంచి మినీ బస్సు సేవలు పరిచయం చేయనున్నట్లు చెన్నై మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (సీఎంఆర్‌ఎల్‌) తెలిపింది. మెట్రోరైలు ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వారి సౌకర్యార్థం ఇప్పటికే మెట్రోపాలిటన్‌ రవాణా సంస్థతో కలసి ఆరు మార్గాల్లో 12 మినీ బస్సులను నడుపుతున్నారు. తాజాగా గవర్నమెంట్‌ ఎస్టేట్‌ -సచివాలయం, గిండీ మెట్రో -వేళచ్చేరి విజయనగర్‌ బస్టాండ్‌, చిన్నమలై మెట్రో -తరమణి, షేనాయ్‌నగర్‌ మెట్రో -టి.నగర్‌, విమానాశ్రయం మెట్రో -తాంబరం వెస్ట్‌ అని ఐదు మార్గాల్లో రెండు చొప్పున మినీ బస్సులు నడుపనున్నట్లు సీఎంఆర్‌ఎల్‌ అధికారులు వివరించారు. 

Updated Date - 2022-06-12T15:17:08+05:30 IST