Palakkadలో ఆధిక్యంలో ‘మెట్రో’ శ్రీధరన్

ABN , First Publish Date - 2021-05-02T18:35:31+05:30 IST

మెట్రో మ్యాన్’, బీజేపీ అభ్యర్థి ఈ శ్రీధరన్ కేరళ శాసన సభ ఎన్నికల్లో

Palakkadలో ఆధిక్యంలో ‘మెట్రో’ శ్రీధరన్

తిరువనంతపురం : ‘మెట్రో మ్యాన్’, బీజేపీ అభ్యర్థి ఈ శ్రీధరన్ కేరళ శాసన సభ ఎన్నికల్లో గెలుపు దిశగా పయనిస్తున్నారు. పాలక్కాడ్ నియోజకవర్గంలో ఆయన దాదాపు 6 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ మొత్తం మీద నాలుగు స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. 


ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) 85 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 71 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాంగ్రెస్ కూటమి 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 


బీజేపీ శ్రీధరన్‌ను పాలక్కాడ్ నుంచి పోటీ చేయించడానికి కారణాలు ఏమిటంటే,  గత శాసన సభ ఎన్నికల్లో పాలక్కాడ్‌లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థి షఫీ పరంబిల్ బీజేపీ అభ్యర్థిపై సుమారు 17 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో కూడా ఆయనే ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మరోవైపు పాలక్కాడ్ మునిసిపాలిటీని గతంలో బీజేపీ గెలుచుకుంది. 


‘మెట్రో’ శ్రీధరన్ (88) ఢిల్లీ మెట్రో వంటి భారీ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసిన ఇంజినీరుగా మంచి పేరు సంపాదించారు. తమిళనాడులోని చారిత్రక పంబన్ బ్రిడ్జిని పునరుద్ధరించడంతో ఆయన వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. భారత ప్రభుత్వం ఆయనకు 2001లో పద్మశ్రీ, 2008లో పద్మ విభూషణ్ పురస్కారాలను ప్రకటించింది.


Updated Date - 2021-05-02T18:35:31+05:30 IST