Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jul 26 2021 @ 09:13AM

Delhi: భూప్రకంపనలు...నిలిచిన మెట్రోరైళ్లు

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో సోమవారం ఉదయం భూప్రకంపనలు సంభవించడంతో మెట్రోరైళ్ల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. భూప్రకంపనలతో ఎక్కడి మెట్రోరైళ్లను అక్కడ ఆపి వేయడంతో మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో నిలిచిపోయారు. సోమవారం ఉదయం 6.42 గంటలకు భూప్రకంపనలు సంభవించడంతో కొంత సేపు మెట్రోరైళ్ల రాకపోకలను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. ప్రయాణికులు ప్లాట్ ఫాంలలో నిలిచిపో్యారు. అనంతరం భూప్రకంపనలు తగ్గడంతో మెట్రోరైళ్లను ముందుజాగ్రత్త చర్యగా తక్కువ వేగంతో నడిపారు.బదర్ పూర్ సరిహద్దు మెట్రో స్టేషనుతోపాటు పలు స్టేషన్ల వద్ద ప్రయాణికులు బారులు తీరారు.ఆనంద్ విహార్ రైల్వేస్టేషనులో గేటు వేయడంతో ప్రయాణికులు వేచి ఉన్నారు. గంటసేపు మెట్రోరైళ్లను నిలిపివేశారని ప్రయాణికులు చెప్పారు.సాంకేతిక లోపం వల్లనే మెట్రోరైళ్లను కొద్దిసేపు ఆపివేశామని మెట్రో అధికారులు చెప్పారు. 


Advertisement
Advertisement