మెట్రో రైళ్లు తిరిగి నడిచేదెప్పుడు..?

ABN , First Publish Date - 2020-08-06T01:00:05+05:30 IST

నగరాల్లో మెట్రో సర్వీసులు తిరిగి ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయనే దానిపై కేంద్ర పౌరవిమానయాన..

మెట్రో రైళ్లు తిరిగి నడిచేదెప్పుడు..?

న్యూఢిల్లీ: నగరాల్లో మెట్రో సర్వీసులు తిరిగి ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయనే దానిపై కేంద్ర పౌరవిమానయాన, హౌసింగ్, అర్బన్ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. రెండు వారాల్లోగా తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇందుకు సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపి)ను జూన్‌లోనే రెడీ చేశామని చెప్పారు. మెట్రో (ట్రాన్స్‌పోర్ట్) సిస్టం తెరవడంపై ఎస్ఓపీని రెండు వారాల్లో అందరి ముందుకు తెస్తామని, అయితే దశల వారీగానే సర్వీసుల పునరుద్ధరణ ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు, హెల్త్‌ కేర్ వర్కర్లు, ఇతర నిత్యావసర సేవల సామర్థ్యం 50 శాతానికి దాటరాదని అన్నారు.


మెట్రో అథారిటీ నష్టాలు చవిచూస్తున్నందున మెట్రో ట్రాన్స్‌పోర్ట్ సిస్టంను ముందుకు తీసుకురావాలని కేంద్ర మంత్రిత్వ శాఖ ఆలోచనగా ఉంది. కాగా, నాలుగో దశ అన్‌లాక్‌ సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నందున మెట్రో సేవలు కూడా ఆ దశలో పునఃప్రారంభమవుతాయనే ఊహాగానాలు ఉన్నాయి. అయితే, పెరుగుతున్న కరోనా కేసులతో పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు మెట్రో సర్వీసుల పునరుద్ధరణకు అనుమతించడం లేదు.


అన్‌లాక్-3లో జిమ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లు తెరుచుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే, ఢిల్లీలో ఇప్పటికే అవి మూసే ఉంటున్నాయి. జిమ్‌లు తెరవమని రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలు రాలేదని ఢిల్లీకి చెందిన జిల్లా మేజిస్ట్రేట్లు చెబుతున్నారు. ఇంతకుముందు హోటళ్లను తిరిగి తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా, అన్‌లాక్-3లో కేంద్రం కూడా అనుమతి ఇచ్చింది. అయితే, ఈ ఆలోచనను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తోసిపుచ్చారు.

Updated Date - 2020-08-06T01:00:05+05:30 IST