మెట్రో రైల్వేస్టేషన్‌లలో సబర్బన్‌ రైలు టిక్కెట్లు

ABN , First Publish Date - 2022-03-20T14:11:48+05:30 IST

మెట్రో రైల్వేస్టేషన్‌లలో త్వరలో సబర్బన్‌ రైల్వే టిక్కెట్లు విక్రయించనున్నట్లు చెన్నై మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (సీఎంఆర్‌ఎల్‌) ప్రకటించింది. ప్రయాణికుల

మెట్రో రైల్వేస్టేషన్‌లలో సబర్బన్‌ రైలు టిక్కెట్లు

పెరంబూర్‌(చెన్నై): మెట్రో రైల్వేస్టేషన్‌లలో త్వరలో సబర్బన్‌ రైల్వే టిక్కెట్లు విక్రయించనున్నట్లు చెన్నై మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (సీఎంఆర్‌ఎల్‌) ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యర్ధం 16 మెట్రో రైల్వేస్టేషన్‌లో రేబిడో, ఊబర్‌ కాల్‌ టాక్సీ, స్మార్ట్‌ బైక్‌ల సదుపాయం, 12 రైల్వేస్టేషన్‌లకు అనుసంధాన బస్సు సేవలు, 5 రైల్వేస్టేషన్‌లలో బ్యాటరీ కారు వసతి అందుబాటులో ఉన్నాయి. అలాగే, ఎగ్మూర్‌, సెంట్రల్‌, గిండి తదితర మెట్రోరైల్వేస్టేషన్‌లలో సబర్బన్‌ రైల్వే టిక్కెట్లు కూడా విక్రయించే సదుపాయం త్వరలో ప్రారంభించనున్నట్లు సీఎంఆర్‌ఎల్‌ తెలిపింది.


Updated Date - 2022-03-20T14:11:48+05:30 IST