హైదరాబాద్: మెట్రోరైలు స్పీడ్ లిమిట్ పెంచేందుకు సీఎంఆర్ఎస్ గ్రీన్సిగ్నలిచ్చింది. మరో 10 కిలోమీటర్ల అదనపు వేగానికి అనుమతిచ్చారు. మార్చి 28, 29, 20 తేదీల్లో స్పీడ్, సెక్యూరిటీ అధికారులు చెక్ చేశారు. ప్రస్తుతం ఉన్న మెట్రోరైలు స్పీడ్ 80 కిలోమీటర్ల నుంచి 90 కిలోమీటర్లకు పెంచారు. మెట్రోరైలు స్పీడ్ లిమిట్ పెంచడంతో నాగోల్-రాయదుర్గం మధ్య 6 నిమిషాల సమయం.. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ మధ్య 4 నిమిషాలు ఆదా అవుతుంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మధ్య 1.5 నిమిషాల సమయం ఆదా అవుతుంది.
ఇవి కూడా చదవండి