Metro కార్డు వాడకంపై గందరగోళం

ABN , First Publish Date - 2022-01-18T19:00:32+05:30 IST

మెట్రో రైళ్లలో నిరాటంకంగా ప్రయాణించేందుకు వీలుగా ప్రవేశపెట్టిన స్మార్ట్‌ కార్డు వాడకంపై ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. ఈ కార్డును ఒకసారి రీజార్జి చేసిన తర్వాత 60 రోజుల్లోగా ఒకసారైనా ప్రయాణం

Metro కార్డు వాడకంపై గందరగోళం

బెంగళూరు: మెట్రో రైళ్లలో నిరాటంకంగా ప్రయాణించేందుకు వీలుగా  ప్రవేశపెట్టిన స్మార్ట్‌ కార్డు వాడకంపై ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. ఈ కార్డును ఒకసారి రీజార్జి చేసిన తర్వాత 60 రోజుల్లోగా ఒకసారైనా ప్రయాణం చేయకపోయినా, కార్డు తీసుకున్న ఏడు రోజుల్లోగా ఏదైనా మెట్రో రైల్వేస్టేషన్‌ ప్రవేశద్వారం వద్ద నమోదు చేసుకోకపోయినా కార్డులో ఉండే నగదు మొత్తం మాయం కానుంది. బెంగళూరు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ రూపొందించిన ఈ నిబంధనలు పూర్తిగా ఆశాస్త్రీయంగా ఉన్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ నిబంధనలను మార్చాలని అధికారులకు విజ్ఞప్తిచేస్తున్నారు. కొవిడ్‌ వేళ టికెట్‌ కొనుగోలు చేసే సదుపాయాన్ని పూర్తిగా రద్దుచేయడంతో చాలా మంది ప్రయాణికులు స్మార్ట్‌కార్డులను కొనుగోలు చేసి ప్రతినెలా రూ. 500 నుంచి రూ. 1000 వరకు రీచార్జి చేసుకుంటున్నారు. ఒక వేళ వారాలకొద్దీ లాక్‌డౌన్‌ విధిస్తే ఆఫీసులకు వెళ్లే పరిస్థితి ఉండదని అలాంటి సమయంలో కార్డులో ఉండే నగదు మాయం కానుండం సరికాదని, కొవిడ్‌ వేళ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న ఉద్యోగులపై ఇది నిజంగా భారమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - 2022-01-18T19:00:32+05:30 IST