మేథీ పరోటా

ABN , First Publish Date - 2020-06-20T18:27:46+05:30 IST

మెంతి కూర - మూడు కట్టలు, సెనగపిండి - అరకప్పు, గోధుమపిండి - ఒక కప్పు, ఇంగువ - చిటికెడు, కారం - అర టీస్పూన్‌, నెయ్యి -

మేథీ పరోటా

కావలసినవి: మెంతి కూర - మూడు కట్టలు, సెనగపిండి - అరకప్పు, గోధుమపిండి - ఒక కప్పు, ఇంగువ - చిటికెడు, కారం - అర టీస్పూన్‌, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి - రెండు, కొత్తిమీర - ఒక కట్ట, ఉప్పు - తగినంత. 


తయారీ: మెంతి కూరను శుభ్రంగా కడిగి కట్‌ చేసి పెట్టుకోవాలి. ఒక పాత్రలో సెనగపిండి, గోధుమపిండి తీసుకోవాలి. అందులో మెంతి కూర, ఇంగువ, కారం, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పరోటాలుగా చేసుకుంటూ పెనంపై నెయ్యి వేస్తూ కాల్చాలి. రెండు వైపులా బాగా కాల్చిన తరువాత వేడివేడిగా సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2020-06-20T18:27:46+05:30 IST