Advertisement
Advertisement
Abn logo
Advertisement

సింగరేణి రాత పరీక్ష కేంద్రాల్లో మెటల్ డిటెక్టర్‌లు

కొత్తగూడెం: సింగరేణి సంస్థలో  ఉద్యోగాల కోసం నిర్వహించే రాతపరీక్ష కోసం పరీక్ష కేంద్రాల్లో మెటల్ డిటెక్టర్లను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 8న 128 ఫిట్టర్ ఉద్యోగాలకు రాత పరీక్ష జరుగనుంది. కొత్తగూడెంలోని 5 కేంద్రాల్లో పరీక్షను నిర్వహిస్తున్నారు. 2,681మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. పరీక్ష రాసిన వెంటనే ఫలితాలు ప్రకటించనున్నారు. మెటల్ డిటెక్టర్లతో పరీక్ష కేంద్రాల్లో అక్రమాలు నివారించవచ్చని సంస్థ అధికారులు పేర్కొన్నారు. పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు అభిస్తాయని అధికారులు తెలిపారు. మోసపూరిత మాటలతో డబ్బు వసూలు చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. 

Advertisement
Advertisement