డేటా చౌర్యం: మెటా(facebook)పై 23,000 కోట్ల దావా

ABN , First Publish Date - 2022-01-15T02:08:39+05:30 IST

గతంలో ఈ విషయమై ఫేస్‌బుక్ బహిరంగ క్షమాపణలు చెప్పింది. బ్రిటన్‌లోని దాదాపు ప్రముఖ పత్రికల మొదటి పేజీల్లో క్షమాపణలు చెబుతూ ప్రకటన చేశారు. అయినప్పటికీ దీనిపై నేటికీ వివాదం కొనసాగుతూనే ఉంది. గొస్మెన్ వేసిన కేసును లండన్‌లోని కాంపిటీషన్ అప్పీల్ ట్రిబ్యూనల్ విచారణ చేపట్టనుంది...

డేటా చౌర్యం: మెటా(facebook)పై 23,000 కోట్ల దావా

లండాన్: బ్రిటన్‌లోని నాలుగున్నర కోట్ల (4.4) మంది వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసిందన్న విషయమై ఫేస్‌బుక్‌ చాలా కాలంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే తాజాగా ఫేస్‌బుక్ యాజమాన్య సంస్థ అయిన మెటాపై ఏకంగా 23.7 వేల కోట్లకు (2.3 బిలియన్ పౌండ్లు) దావా వేశారు. బ్రిటన్ ఫైనాన్షియల్ అథారిటీ సీనియర్ సలహాదారుడైన లిజా లోవదల్ గోస్మెన్ ఈ దావా వేశారు. 2015-2019 మధ్య బ్రిటన్‌లోని మిలియన్ ప్రజల వ్యక్తిగత డేటాను ఫేస్‌బుక్ తన వ్యాపారం కోసం దుర్వినియోగం చేసిందని, అందుకే తాను ఆ ప్రజల తరపున దావా వేస్తున్నట్లు గెస్మెన్ తెలిపారు.


అయితే గతంలో ఈ విషయమై ఫేస్‌బుక్ బహిరంగ క్షమాపణలు చెప్పింది. బ్రిటన్‌లోని దాదాపు ప్రముఖ పత్రికల మొదటి పేజీల్లో క్షమాపణలు చెబుతూ ప్రకటన చేశారు. అయినప్పటికీ దీనిపై నేటికీ వివాదం కొనసాగుతూనే ఉంది. గొస్మెన్ వేసిన కేసును లండన్‌లోని కాంపిటీషన్ అప్పీల్ ట్రిబ్యూనల్ విచారణ చేపట్టనుంది. అనతి కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మందికి చేరువైన ఫేస్‌బుక్.. కొన్ని అనవసరపు పాలసీల ద్వారా ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని తప్పుదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ప్రపంచ వ్యాప్తంగా బలంగా వినిపిస్తున్నాయి.

Updated Date - 2022-01-15T02:08:39+05:30 IST