పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-05-18T03:39:28+05:30 IST

పేద ప్రజల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌ పేర్కొన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రులలో అధిక ఫీజులు, సీటీ స్కాన్‌ పేరిట వసూళ్ళు, రెమ్‌డెసివిర్‌ అక్రమ దందా కట్టడికి కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలన్నారు.

పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌

బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌

 ఏసీసీ, మే 17 : పేద ప్రజల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌ పేర్కొన్నారు. సోమవారం  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రులలో అధిక ఫీజులు, సీటీ స్కాన్‌ పేరిట వసూళ్ళు,  రెమ్‌డెసివిర్‌ అక్రమ దందా కట్టడికి కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలన్నారు.  ప్రభుత్వాసుపత్రులలో టెస్టింగ్‌ కిట్ల కొరత వలన ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. దీని వల్ల కరోనా త్వరగా వ్యాప్తిచెందే అవకాశం ఉందన్నారు. కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారికి ప్రభుత్వం హోంఐసోలేషన్‌ కిట్లు ఇవ్వకపోవడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. ఎమ్మెల్యే సీటీ స్కాన్‌ యజమానులతో మాట్లాడి రూ.2500 మాత్రమే చెల్లించాలని సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారన్నారు. అయినా అధిక ఫీజు వసూలు చేస్తున్నారన్నారు.  ప్రైవే టు ఆసుపత్రులు, ప్రభుత్వం కుమ్మక్కై రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ కొరత తీసుకొచ్చి అక్రమంగా దందా చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకొని అధిక ఫీజులను అరికట్టాలని, ఎమ్మార్పీ ధరలకే రెమ్‌డెసివిర్‌ అందించాలన్నారు. 

హోం ఐసోలేషన్‌ కిట్ల అందజేత

దండేపల్లి: కన్నెపల్లి, నంబాల, వెల్గనూర్‌ గ్రామాల్లోని కొవిడ్‌ బారిన పడి హోం ఐసోలేషన్‌ ఉంటున్న ఆరు గురికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘనాథ్‌రావు మెడికల్‌ కిట్లను సోమవారం అందజేశారు. ఉచిత హెల్ప్‌లైన్‌కు కరోనా బాధితులు ఫోన్‌ చేయడంతో వారి ఇండ్లకు వెళ్లి ఆరోగ్య పరిస్ధితులను తెలుసుకున్నారు. వైద్యుల సూచన మేరకు మెడికల్‌ కిట్లను అందజేసి  మనోధైర్యం కల్పించారు. మండల అధ్యక్షుడు రాజయ్య, సురేష్‌,  పట్టి వెంకటకృష్ణ,  మల్లిఖార్జున్‌ పాల్గొన్నారు. 

హాజీపూర్‌: దొనబండకు చెందిన ఇద్దరు, ధర్మా రం గ్రామానికి చెందిన ఐదుగురు, గుడిపేటలో ఒక  ఇద్దరికి, మరో కుటుంబంలో ఇద్దరికి కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌ ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేశారు. డాక్టర్‌ సూచన మేరకు  సోమవారం ఆయన వారి ఇండ్లకు వెళ్ళి మెడికల్‌ కిట్లను అందజేసి మనోధైర్యాన్ని కల్పించారు. కార్యక్రమంలో మాడిపెల్లి సత్యం, దామెరకుంట నర్సయ్య, ఆరెందుల రాజేష్‌, బయ్యా మధుకర్‌, అభిలాష్‌, మల్లేష్‌, తోట మల్లికార్జున్‌, పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-18T03:39:28+05:30 IST