టెలిగ్రామ్‌లో మెసేజ్‌ షెడ్యూలింగ్‌

ABN , First Publish Date - 2022-08-13T05:30:00+05:30 IST

పుట్టినరోజులు లేదంటే అంతకంటే ముఖ్యమైన తేదీలు గుర్తుంచుకుని మెసేజ్‌లు పెట్టడంలో చాలా మందికి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఒక్కోసారి ఆ మరుపు ఇబ్బందులకు దారితీస్తుంది.

టెలిగ్రామ్‌లో మెసేజ్‌ షెడ్యూలింగ్‌

పుట్టినరోజులు లేదంటే అంతకంటే  ముఖ్యమైన తేదీలు గుర్తుంచుకుని మెసేజ్‌లు పెట్టడంలో చాలా మందికి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఒక్కోసారి ఆ మరుపు ఇబ్బందులకు దారితీస్తుంది. అయితే అలాంటి విషయాల్లో ‘నో వర్రీ’ అంటోంది టెలిగ్రామ్‌ యాప్‌. అందుకోసం కొత్తగా మెసేజ్‌ షెడ్యూలింగ్‌ ఫీచర్‌ను టెలిగ్రామ్‌ తీసుకువచ్చింది. పాపులారిటీ బాగా ఉన్న వాట్సాప్‌లో కూడా ఈ ఫీచర్‌ లేకపోవడం గమనార్హం. అలాగే ‘సేవ్డ్‌ మెసేజెస్‌’ లోనూ ఇది ఉపయోగపడుతుంది. ఓన్‌టైమ్‌ ట్రావెలింగ్‌ సెక్రటరీ మాదిరిగా పనిచేస్తుంది. అయితే దీన్ని ఉపయోగించుకునేందుకు ఇలా చేయాలి.


  • టెలిగ్రామ్‌ ఓపెన్‌ చేసి చాట్‌ బాక్స్‌లోకి వెళ్ళాలి. షెడ్యూల్‌ చేయాలని అనుకుంటున్న మెసేజ్‌ అవసరమైన కాంటాక్ట్‌ దగ్గరకు వెళ్ళాలి.
  • చాట్‌ బాక్స్‌లోకి వెళ్ళగానే, షెడ్యూల్‌ చేయాలని అనుకుంటున్న మెసేజ్‌ను టైప్‌ చేయాలి.
  • సెండ్‌ మెసేజ్‌ బటన్‌ను లాంగ్‌ ప్రెస్‌ చేయాలి. విండో పాపప్‌ అవుతుంది. 
  • అక్కడ రెండు ఆప్షన్స్‌ కనిపిస్తాయి. అందులో ఒకటి మెసేజ్‌ని సైలెంట్‌గా రిసీవర్‌కు కూడా తెలియనివిధంగా పంపేయడం. రెండోది షెడ్యూల్‌ మెసేజ్‌. దీన్ని ఇక్కడ టాప్‌ చేయాలి.
  • షెడ్యూల్‌ మెసేజ్‌ ఆప్షన్‌ని ఎంపిక చేసుకోగానే అది డేట్‌, టైమ్‌ అడుగుతుంది. అది సెట్‌ చేస్తే కరెక్ట్‌ తేదీ, సమయానికి వెళుతుంది.
  • ఆ డేట్‌, టైమ్‌ కింద ఉండే బ్లూ బటన్‌ని క్లిక్‌ చేస్తే చాలు, పని అయిపోయినట్లే. ఇక మీ ప్రమేయం లేకుండానే నిర్దేశించిన తేదీ, సమయానికి ఆ మెసేజ్‌ రిసీవర్‌ వద్దకు వెళుతుంది. 

Updated Date - 2022-08-13T05:30:00+05:30 IST