నాగోబా దర్శనానికి మెస్రం వంశీయులు

ABN , First Publish Date - 2022-01-27T05:29:05+05:30 IST

మండలంలోని మున్యాల్‌ గోండుగూడెం, మల్లాపూర్‌, భూత్కూర్‌, చెన్నూర్‌ గ్రామాలకు చెందిన మెస్రం వంశీయులు ఎడ్లబండ్ల ద్వారా ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌ గ్రామంలోని నాగోబా దర్శనానికి బుధవారం బయలుదేరారు.

నాగోబా దర్శనానికి మెస్రం వంశీయులు
నాగోబా దర్శనానికి బయలుదేరిన మెస్రం వంశీయులు

దస్తూరాబాద్‌, జనవరి 26 : మండలంలోని మున్యాల్‌ గోండుగూడెం, మల్లాపూర్‌, భూత్కూర్‌, చెన్నూర్‌ గ్రామాలకు చెందిన మెస్రం వంశీయులు  ఎడ్లబండ్ల ద్వారా ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌ గ్రామంలోని నాగోబా దర్శనానికి బుధవారం బయలుదేరారు. అంతకుముందు మెస్రం వంశీయుల కులదేవతలకు పూజలు చేశారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌ గ్రామానికి ఈనెల 12వ తేదీకి చేరుకుం టామని, మొత్తం మండలంలోని 4 గోండుగూడెం గ్రామాల నుండి 5 ఎడ్ల బండ్ల ద్వారా, 12 కుటుంబాలు బయలుదేరినట్లు మెస్రం పెద్దపటేల్‌ భీంరావు తెలిపారు. వచ్చే నెల ఫిబ్రవరి 9వ తేదీ వరకు కేస్లాపూర్‌ నాగోబా దగ్గరే ఉండి నాగోబా కులదేవతకు పూజలు చేస్తామని, అక్కడి నుంచి తిరిగి శ్యాం పూర్‌ నాగోబాదేవతలకు పూజలు చేసి, అక్కడి నుండి బయలుదేరి వచ్చే నెల 12వ తేదీన తమ గ్రామాలకు చేరుకుంటామని వివరించారు. 

Updated Date - 2022-01-27T05:29:05+05:30 IST