నాగోబా మహా పూజకు మెస్రం వంశీయులు

ABN , First Publish Date - 2021-01-16T05:34:32+05:30 IST

ఆదివాసీల ఆరధ్యదైవం నాగోబా పండుగను పురష్కరించుకొని ఫిబ్రవరి 11న నిర్వహించే మెస్రం వంశీయుల మహాపూజల ప్రచార యా త్రను శుక్రవారం మెస్రం వంశీయులు ప్రారంభించారు.

నాగోబా మహా పూజకు మెస్రం వంశీయులు
నాగోబా జాతర ప్రచారానికి వెళ్తున్న మెస్రం వంశీయులు

ఇంద్రవెల్లి, జనవరి 15: ఆదివాసీల ఆరధ్యదైవం నాగోబా పండుగను పురష్కరించుకొని ఫిబ్రవరి 11న నిర్వహించే మెస్రం వంశీయుల మహాపూజల ప్రచార యా త్రను శుక్రవారం మెస్రం వంశీయులు ప్రారంభించారు. గురువారం రాత్రి చంద్రుడి నెలవంకను చూసిన మెస్రం వంశీయులు శుక్రవారం కేస్లాపూర్‌ గ్రామలోని నాగో బా సన్నిధి వద్దకు చేరి నాగోబా మహాపూజ నిర్వహణపై చర్చించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మెస్రం వంశంలోని కటోడ మెస్రం హన్మంత్‌రావ్‌, ప్రధాన్‌ మెస్రం తుక్కోజీల ఆధ్వర్యంలో చకడ(చిన్నఎడ్లబండి)పై ప్రచారానికి బయలు దేరి వెళ్లారు. ముందుగా కేస్లాపూర్‌ నుంచి ప్రారంభించిన ప్రచార బండి  సిరికొండ మండల కేంద్రంలోని కుమ్మరి స్వామి వద్దకు వెల్లి నాగోబా మహాపూజకు అవసరమగు కుండల తయారికీ ఇస్తారు. అనంతరం రాజంపేట్‌ గ్రామంలో మెస్రం వంశం కుటుబీకుల వద్దకు వెళ్లి బస చేస్తారు. ఈ నెల 16న గుడిహత్నూర్‌ మండలంలోని సోయం గూడ, 17న ఇంద్రవెల్లి మండలంలోని గిన్నెర, 18న ఉట్నూర్‌ మండలంలోని సాలేవాడ. 19న ఇంద్రవెల్లి మండలంలోని వడ్‌గాం గ్రామాలకు తిరిగి నాగోబా మహాపూజ సామగ్రిపై ప్రచారం నిర్వహించి తిరిగి ఈ నెల 20న కేస్లాపూర్‌ గ్రామానికి చేరనున్నట్లు తెలిపారు. 21న నాగోబా మహాపూజలకు అవసరమగు గంగాజలం కోసం జన్నారం మండలం గోదావిర హస్తిన మడుగు బయలుదేరి వెళ్లనున్నట్లు మెస్రం వంశీయులు తెలిపారు. గోదావరి హస్తిన మడుగులో సేకరించిన పవిత్రమైన గంగాజలంతో పుస్యమాసం అమావాస్య పురస్కరించుకొని ఫిబ్రవరి 11న మెస్రం వంశీయులు నాగోబా ఆలయంలో మహాపుజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశం పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావు, మెస్రం వంశం పెద్దలు మెస్రం చిన్ను, మెస్రం హన్‌మంత్‌రావు, కోటడ మెస్రం కోసు, మెస్రం  తుక్టోజీ, మెస్రం తిరుపతి, సోనేరావు, దేవ్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-16T05:34:32+05:30 IST