Abn logo
Jul 6 2020 @ 08:22AM

అగ్ర దర్శకుడి బాట‌లో మేర్ల‌పాక‌...?

యువ ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సినిమాల‌ను మాత్ర‌మే తెర‌కెక్కించారు. ఈ యంగ్ డైరెక్ట‌ర్ ఇప్పుడు ఓ స్టార్ డైరెక్ట‌ర్‌ను ఫాలో అవుతున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.  ఇంత‌కూ మేర్ల‌పాక ఫాలో అవుతున్న స్టార్ డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా?  సుకుమార్‌. త‌న ద‌ర్శ‌కత్వ శాఖ‌లో ప‌నిచేసే వారిని ద‌ర్శ‌కులుగా మార్చే బాధ్య‌త‌ను తీసుకుని ఓ బ్యాన‌ర్‌ను సుక్కు స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. క‌థ బావుంటే త‌న బ్యాన‌ర్‌లో సుక్కు సినిమాల‌ను నిర్మిస్తున్నారు. అంతే కాకుండా వీలైతే త‌నే క‌థ, మాల‌ను కూడా అందిస్తున్నారు. ఇప్పుడు ఇదే బాట‌లో మేర్ల‌పాక గాంధీ త‌న ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లోని వారిని దర్శ‌కులుగా మార్చే ప్ర‌క్రియ‌ను షురూ చేశార‌ని టాక్‌. త‌న అసిస్టెంట్‌ యువీ బ్యాన‌ర్‌లో పరిచ‌యం అవుతుంటే ఆ సినిమాకు మేర్ల‌పాక క‌థ‌, మాట‌ల‌ను అందిస్తున్నార‌ని సోష‌ల్ మీడియా స‌మాచారం. 

Advertisement
Advertisement
Advertisement