WiFi: మెరీనాతీరంలో ఉచిత వైఫై

ABN , First Publish Date - 2022-09-27T13:25:22+05:30 IST

నగర వాసులకు మెరుగైన సదుపాయాల కల్పన కోసం పలు చర్యలు చేపడుతున్న గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ).. మరో సరికొత్త పథకం అమలులోకి

WiFi: మెరీనాతీరంలో ఉచిత వైఫై

పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 26: నగర వాసులకు మెరుగైన సదుపాయాల కల్పన కోసం పలు చర్యలు చేపడుతున్న గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ).. మరో సరికొత్త పథకం అమలులోకి తెస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మెరీనాతీరంలో ఉచిత వైఫై సేవల్ని ప్రవేశపెట్టనుంది. జీసీసీ(GCC) పరిధిలో స్మార్ట్‌ సిటీ పథకంలో భాగంగా 49 ప్రాంతాల్లో స్మార్ట్‌ స్తంభాలు ఏర్పాటుచేసి, ఆయా ప్రాంతాల్లో ప్రజలు అర్ధగంట సేపు ఉచితంగా వైఫ్‌ వినియోగించుకునేలా ఏర్పాట్లు చేపట్టిన విషయం తెలిసిందే. 15వ మండలం మినహా మిగిలిన అన్ని మండలాల్లో ఈ సదుపాయం ఉంది. అదే సమయంలో చేపాక్కం-ట్రిప్లికేన్‌ ప్రాంతాల శాసన సభ్యుడు ఉదయనిధి వినతి మేరకు ఉచిత వైఫ్‌(Free wife) అందుబాటులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో, మెరీనా బీచ్‌లో ఉచిత వైఫ్‌ ఏర్పాటుకు జీసీసీ చర్యలు చేపట్టింది. ఈ విషయమై జీసీసీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. మెరీనా బీచ్‌ను ప్రతిరోజూ వేలాదిమంది సందర్శిస్తుంటారని, అందువల్ల బీచ్‌లో మరిన్ని వసతులు కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. అందులో భాగంగా లైట్‌ హాస్‌ నుంచి శ్రామిక స్థూపం వరకు ఐదు ప్రాంతాల్లో స్మార్‌ స్తంభాలు ఏర్పాటుచేస్తున్నామని, త్వరలో ఈ ప్రాంతాల్లో ఉచిత వైఫ్‌ అందించేందుకు సిద్ధమమని వివరించారు. 

Updated Date - 2022-09-27T13:25:22+05:30 IST