అరబిందో ఫార్మాలో అనుబంధ సంస్థల విలీనం

ABN , First Publish Date - 2021-04-09T05:52:03+05:30 IST

అరబిందో ఫార్మాకు చెందిన అనుబంధ కంపెనీలు అరబిందోలో విలీనం కానున్నాయి. సవరించిన విలీన పథకానికి జాతీయ కంపెనీ చట్టం ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ), హైదరాబాద్‌ బెంచ్‌ అనుమతి ఇచ్చిందని కంపెనీ వెల్లడించింది

అరబిందో ఫార్మాలో అనుబంధ సంస్థల విలీనం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అరబిందో ఫార్మాకు చెందిన అనుబంధ కంపెనీలు అరబిందోలో విలీనం కానున్నాయి. సవరించిన విలీన పథకానికి జాతీయ కంపెనీ చట్టం ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ), హైదరాబాద్‌ బెంచ్‌ అనుమతి ఇచ్చిందని కంపెనీ వెల్లడించింది. ఏపీఎల్‌ హెల్త్‌కేర్‌ మినహాయించి ఏపీఎల్‌ రిసెర్చ్‌ సెంటర్‌, ఆరోజిమ్స్‌, క్యూర్‌ప్రో పేరెంటల్స్‌, సిలికాన్‌ లైఫ్‌ సైన్సెస్‌ తదితర కంపెనీలు అరబిందో ఫార్మాలో విలీనమవుతాయి. వనరులను సమర్థవంతగా వినియోగించుకోవడానికి అనుబంధ సంస్థల విలీనం దోహదం చేస్తుందని అరబిందో ఫార్మా పేర్కొంది. 

Updated Date - 2021-04-09T05:52:03+05:30 IST