Jagan GOVTకు తలనొప్పిగా స్కూళ్ల విలీనం

ABN , First Publish Date - 2022-07-15T23:44:09+05:30 IST

ABN కథనాలకు ఏపీ ప్రభుత్వం దిగి వచ్చింది. జగన్‌ సర్కార్‌కు స్కూళ్ల విలీనం తలనొప్పిగా మారింది.

Jagan GOVTకు తలనొప్పిగా స్కూళ్ల విలీనం

అమరావతి:  స్కూళ్ల విలీనంపై ABN పలు కథనాలు ప్రచురించింది. ABN కథనాలతో ఎట్టకేలకు  ఏపీ ప్రభుత్వం(AP Govt) దిగి వచ్చి దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. పాఠశాలల విలీనం, మూసివేతపై ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. పిల్లలు స్కూళ్లు మానేస్తుండటంతో జగన్‌ సర్కార్‌కు స్కూళ్ల విలీనం తలనొప్పిగా మారింది. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అలాగే ఈ విషయంలో ప్రభుత్వంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమీలేక మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa Satyanarayana) స్కూళ్ల విలీనంపై ఎమ్మెల్యేలకు లేఖ రాశారు. విలీనంలో ఇబ్బందులపై లిఖితపూర్వక విజ్ఞాపనలు ఇవ్వాలని మంత్రి బొత్ససత్యనారాయణ ఎమ్మెల్యేలను ఆదేశించారు. రాష్ట్రపతి ఎన్నికల ఓటు వేసేందుకు వచ్చినప్పుడు  విజ్ఞాపనలు ఇవ్వాలని మంత్రి తెలిపారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులను విజ్ఞాపనలో పొందుపర్చాలని మంత్రి బొత్ససత్య నారాయణ ఎమ్మెల్యేలను ఆదేశించారు. 

Updated Date - 2022-07-15T23:44:09+05:30 IST