నిజామాబాద్: బోధన్ బస్టాండ్‌లో భారీ దొంగతనం జరిగింది. బోధన్ నుంచి హైదరాబాద్ వ్యాపారి దళపతి తిరుగు పయనమైయ్యారు. తన వెంట తీసుకువస్తున్న బంగారం, వెండి, నగదు చోరి అయిందని వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు ఎక్కి టికెట్ కోసం డ్రైవర్ వద్దకు వెళ్లి వచ్చే లోపల చోరి జరిగిందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.