ప్రభుత్వ పాఠశాలల్లో పరిసరాల పరిశుభ్రతకు కృషి

ABN , First Publish Date - 2021-04-17T05:56:34+05:30 IST

సర్పవరం జంక్షన్‌, ఏప్రిల్‌ 16: ప్రభుత్వ పాఠశాలల్లో పరిసరాల పరిశుభ్రత, మరుగుదొడ్ల సక్రమ నిర్వహణకు కృషి చేయాలని ఎంఈవో ఎల్‌.గణే్‌షబాబు కోరారు. శుక్రవారం రమణయ్యపేటలోని మండల పరిషత్‌ కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్న

ప్రభుత్వ పాఠశాలల్లో పరిసరాల పరిశుభ్రతకు కృషి
సమావేశంలో మాట్లాడుతున్న ఎంఈవో గణే్‌షబాబు

ఎంఈవో గణే్‌షబాబు 

సర్పవరం జంక్షన్‌, ఏప్రిల్‌ 16: ప్రభుత్వ పాఠశాలల్లో పరిసరాల పరిశుభ్రత, మరుగుదొడ్ల సక్రమ నిర్వహణకు కృషి చేయాలని ఎంఈవో ఎల్‌.గణే్‌షబాబు కోరారు. శుక్రవారం రమణయ్యపేటలోని మండల పరిషత్‌ కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, హైస్కూల్స్‌ ప్రధానోపాధ్యాయులకు టాయ్‌లెట్ల నిర్వహణపై నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. మరుగుదొడ్ల నిర్వహణకు ప్రత్యేకంగా ఆయాలను నియమించామని, రోజుకు మూడుసార్లు మరుగుదొడ్లను శుభ్రం చేసేలా ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఎంఈవో సూచించారు. కార్యక్రమంలో సీఆర్పీలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-04-17T05:56:34+05:30 IST