మానసికంగా బలంగా...

ABN , First Publish Date - 2021-10-11T05:30:00+05:30 IST

పిల్లలు భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లనైనా సమర్ధవంతంగా ఎదుర్కోవాలంటే మానసికంగా దృఢంగా ఉండాలి. అయితే పిల్లలను అలా ...

మానసికంగా బలంగా...

  1. పిల్లలు భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లనైనా సమర్ధవంతంగా ఎదుర్కోవాలంటే మానసికంగా దృఢంగా ఉండాలి. అయితే  పిల్లలను అలా తయారుచేసే బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది. ఈ విషయంలో తల్లిదండ్రులుచేయాల్సిన పనులు ఏమిటంటే...
  2. పిల్లల ఫీలింగ్స్‌ని ఆపకూడదు. వాళ్ల ఫీలింగ్స్‌ని తక్కువ చేయడం, మధ్యలో కలగజేసుకుని ఆపేందుకు ప్రయత్నించడం చేయకూడదు. ఒకవిధంగా చెప్పాలంటే వాళ్ల ఫీలింగ్స్‌ని పట్టించుకోకుండా వదిలేయాలి.
  3. పిల్లలు కొత్త అంశాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటప్పుడు మీలోని భయాలను వాళ్లకు చెప్పి ఆపేందుకు ప్రయత్నించకూడదు. మీ ఫెయిల్యూర్స్‌ని వాళ్లకు చెప్పి భయపెట్టకూడదు. వాళ్లు ధైర్యంగా ప్రయత్నించేందుకు అవకాశం ఇవ్వాలి. ఇండిపెండెంట్‌గా ఎదగనివ్వాలి.
  4.  పిల్లలకు కొన్నిసార్లు చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఆ సమయంలో బాధ, యాంగ్జయిటీ ఉంటుంది. అలాంటప్పుడు వదిలేయకుండా వాళ్లకు చేయూతనివ్వాలి. తల్లిదండ్రుల సపోర్టు ఆ సమయంలో చాలా అవసరం. ఒకవేళ తల్లిదండ్రుల రక్షణ లేకపోతే దీర్ఘకాలంలో ఆ ఎమోషన్స్‌ ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
  5.  పిల్లలను వాళ్ల బాధ్యతల నుంచి తప్పించుకోకుండా చూడాలి. వాళ్ల వయసుకు తగిన బాధ్యతలను అప్పగించి, ఆత్మవిశ్వాసంతో పూర్తిచేసేలా చూడాలి. ఇలా చేయడం వల్ల మానసికంగా బలంగా తయారవుతారు.

Updated Date - 2021-10-11T05:30:00+05:30 IST