మెంటల్ ఆస్పత్రిలో 16 ఏళ్ల బాలిక గర్బవతి.. తండ్రి ఎవరో ఎలా తెలిసిందంటే..

ABN , First Publish Date - 2022-02-08T05:52:57+05:30 IST

ఒక మెంటల్ ఆస్పత్రిలో మానసికంగా వికలాంగురాలైన ఒక 16 ఏళ్ల బాలిక కడుపు నొప్పితో బాధపడుతోంది. ఆమెను పరీక్షించిని డాక్టర్లు ఆమె గర్బవతి అని తెలిసి షాకయ్యారు. ఆ బాలికకు ఇలాంటి స్థితికి తీసుకొచ్చిన వ్యక్తి...

మెంటల్ ఆస్పత్రిలో 16 ఏళ్ల బాలిక గర్బవతి.. తండ్రి ఎవరో ఎలా తెలిసిందంటే..

ఒక మెంటల్ ఆస్పత్రిలో మానసికంగా వికలాంగురాలైన ఒక 16 ఏళ్ల బాలిక కడుపు నొప్పితో బాధపడుతోంది. ఆమెను పరీక్షించిని డాక్టర్లు ఆమె గర్బవతి అని తెలిసి షాకయ్యారు. ఆ బాలికకు ఇలాంటి స్థితికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరని తెలియక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఈ మిస్టరీని ఎలా ఛేదించారంటే..


వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో ఉధ్యాన్ కేర్ అనే ఒక మెంటల్ హాస్పిటల్ ఉంది. ఆ ఆస్పత్రిలో ఒక మానసిక వికలాంగురాలైన 16 ఏళ్ల బాలిక తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండగా.. వైద్యులు ఆమెను పరీక్షించి గర్భవతి అని చెప్పారు. దీంతో ఆస్పత్రి యాజమాన్యం బాలిక గర్భం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


పోలీసులు ఆ బాలిక ముందు ఆస్పత్రిలో పనిచేసే పరుషులందరినీ నిలబెట్టారు. ఆ బాలిక వారందరిలో ఒక సెక్యూరిటీ గార్డుని చూసి భయపడింది. ఆ గార్డు తనని రోజూ గదిలో తీసుకెళ్లి నగ్నం చేసి కొట్టేవాడని చెప్పింది. దీంతో పోలీసులు ఆ సెక్యూరిటీ గార్డుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ గార్డుకి డిఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. అతడు ఇలాగే ఆస్పత్రిలో మానసిక వికలాంగులైన స్త్రీలపై అత్యాచారాలు చేశాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Updated Date - 2022-02-08T05:52:57+05:30 IST