క్రీడలతో మానసిక ఉల్లాసం

ABN , First Publish Date - 2021-03-08T05:44:14+05:30 IST

క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని కలిగిస్తాయని ఉమ్మడి జిల్లా గజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు అజ్మీరా శ్యాంనాయక్‌ అన్నారు.

క్రీడలతో మానసిక ఉల్లాసం
క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభిస్తున్న శ్యాంనాయక్‌

ఉట్నూర్‌, మార్చి 7: క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని కలిగిస్తాయని ఉమ్మడి జిల్లా గజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు అజ్మీరా శ్యాంనాయక్‌ అన్నారు. ఆదివారం స్థానిక ఎన్టీఆర్‌ గ్రౌండ్‌లో తెలంగాణ చాంపియన్‌ షిప్‌ ట్రోఫీ క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. క్రీడాకారులు స్నేహపూర్వక వాతావరణంలో పోటీల్లో పాల్గొనాలన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు కేవలం మార్కుకే ప్రాధాన్యం ఇస్తున్నారని క్రీడలపై ఆసక్తి చూయించడం లేదని అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమం ద్వారా ప్రజలందరు ఇంటింటికీ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంద్రజైవంత్‌రావు, వైస్‌ ఎంపీపీ బాలాజీ, కోఆప్షన్‌ సభ్యుడు, సయ్యద్‌ రషీద్‌, సింగారే భరత్‌, కామెర పోశన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-08T05:44:14+05:30 IST