క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం

ABN , First Publish Date - 2021-01-27T06:24:10+05:30 IST

క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం పెరుగుతుందని సినీ నటుడు సంపూర్ణేష్‌బాబు అ న్నారు.

క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం
బహుమతులు అందజేస్తున్న సినీ నటుడు సంపూర్ణేష్‌బాబు, ఎమ్మెల్యే చందర్‌

- సినీ నటుడు సంపూర్ణేష్‌బాబు

కోల్‌సిటీ, జనవరి 26: క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం పెరుగుతుందని సినీ నటుడు సంపూర్ణేష్‌బాబు అ న్నారు. మంగళవారం మార్కండేయకాలనీలోని ఒక ఫంక్షన్‌హాల్‌లో స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడాపోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి బహుమతులు అందజేశారు. అనంతరం సం పూర్ణేష్‌బాబు మాట్లాడారు. కార్యక్రమంలో ఎ మ్మెల్యే కోరుకంటి చందర్‌, కార్పొరేటర్లు కృష్ణవేణి, గణముక్కుల మహాలక్ష్మి, బాల రాజ్‌కుమార్‌, కన్నూరి సతీష్‌కుమార్‌, జేవీ రాజు, స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు రంగు శ్రీను, గౌరవ అధ్యక్షులు సత్యనారాయణ, కొండపర్తి నరహరి, శ్రీధరచారి పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-27T06:24:10+05:30 IST