Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ఆనందం: మంత్రి హరీశ్‌రావు

గజ్వేల్‌, నవంబరు 26: ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ఆనందం లభిస్తుందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గజ్వేల్‌ పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు మైదానంలో శుక్రవారం ప్రారంభమైన లక్ష దీపార్చన కార్యక్రమానికి ఆయన మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఆందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డిలతో కలసి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సచ్చిదానంద సరస్వతి ప్రవచనాలను విన్న మంత్రి హరీశ్‌రావు  అనంతరం మాట్లాడుతూ భక్తి భావంతో మానసికంగా ధృఢంగా మారుతామన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, వైస్‌ చైర్మన్‌ జకీయోద్దీన్‌, కౌన్సిలర్లు, లక్ష దీపార్చన కార్యక్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement