Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 28 2021 @ 19:04PM

స్త్రీల రిజర్వుడు సీట్లలో కూర్చునే పురుషులకు జరిమానా

ముంబై : మహారాష్ట్రలో బెస్ట్ సంస్థ నడిపే బస్సుల్లో మహిళల కోసం కేటాయించిన సీట్లలో పురుషులు కూర్చుని ప్రయాణం చేస్తే కఠిన చర్యలు తప్పవు. ఓ నివేదికను ఉటంకిస్తూ, జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, స్త్రీలకు కేటాయించిన రిజర్వుడు సీట్లలో కూర్చునే పురుషుడు పోలీసులు లేదా రీజనల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీస్ నిర్ణయించిన జరిమానాను చెల్లించవలసి ఉంటుంది. ఈ జరిమానా రూ.500 వరకు ఉండవచ్చు. ట్రాన్స్‌పోర్టు కంపెనీ బెస్ట్‌లో పని చేసే కండక్టర్లకు ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. 


స్త్రీల రిజర్వుడు సీట్లలో పురుషులు కూర్చుంటే, వెంటనే ఆ బస్సును సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళాలని కండక్టర్లను ఆ కంపెనీ ఆదేశించింది. మహారాష్ట్ర మోటారు వాహనాల నిబంధనల ప్రకారం అటువంటి పురుషులను పోలీసులు విచారణ జరిపి, శిక్షిస్తారని తెలిపింది. 


తమకు కేటాయించిన సీట్లలో పురుషులు కూర్చుంటున్నారని, తాము కోరినప్పటికీ ఖాళీ చేయడం లేదని చాలా మంది మహిళలు బెస్ట్ కంపెనీకి ఫిర్యాదు చేశారు. దీంతో బెస్ట్ కమిటీ సమావేశమై నిబంధనలను పాటించని పురుషులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. 


Advertisement
Advertisement