మగువలుగా మగవారు.. ఈ వింత ఆచారం ఎక్కడో, ఎందుకో తెలుసా..

ABN , First Publish Date - 2022-03-19T02:28:44+05:30 IST

మగువలుగా మగవారేంటీ.. అని ఆశ్చర్యపోతున్నారా! కానీ ఇది మాత్రం నిజం. ఒకరి ఆచారాలు ఇంకొకరికి విచిత్రంగా అనిపించడం సహజమే. కొన్ని చోట్ల కొన్ని విచిత్రమైన సంప్రదాయాలు..

మగువలుగా మగవారు.. ఈ వింత ఆచారం ఎక్కడో, ఎందుకో తెలుసా..

మగువలుగా మగవారేంటీ.. అని ఆశ్చర్యపోతున్నారా!  కానీ ఇది మాత్రం నిజం. ఒకరి ఆచారాలు ఇంకొకరికి విచిత్రంగా అనిపించడం సహజమే. కొన్ని చోట్ల కొన్ని విచిత్రమైన సంప్రదాయాలు ఉండడం తెలిసిందే. ఇంకొన్ని ప్రాంతాల వారు పాటించే సంప్రదాయాలు చూస్తే మరీ విచిత్రంగా ఉంటాయి. ఆయా ప్రాంతాల పరిస్థితులు, ప్రభావాల కారణంగా కొందరు అనాదిగా కొన్ని ఆచారాలను పాటిస్తుంటారు. అలాగే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రాంతంలో కూడా మగవారు మగువలుగా మారడం జరుగుతుంటుంది. ఈ సంప్రదాయం ఏ ప్రాంతం వారు.. ఎందుకు పాటిస్తున్నారో తెలుసుకుందాం.. 


హోలీ పండుగ రోజు రంగులు చల్లుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఆలయాలకు వెళ్లి నైవేద్యాలను పెట్టి పూజిస్తారు. కానీ కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకుడ్లూరులో ఈ పండుగను రెండు రోజుల పాటు జరుపుకొంటారు. రథీమన్మద రథోత్సవం, కామదహనం, శవయాత్ర, ఇతరత్రా వేషధారణలు ఉంటాయి. హోలీ పండుగ రెండు రోజులు రథీమన్మదుడిని ఆడవాళ్లైనా, మగవాళ్లైనా తమకు కావాల్సినవి కోరుకుంటే వచ్చే ఏడాది హోళీ నాటికి నెరవేరుతాయని గ్రామ ప్రజల నమ్మకం. మగవారు మగువలుగా మారి అలంకరించుకుని స్వామిని దర్శించుకుంటారు. శుక్రవారం ఆ గ్రామంలో మగవారు మహిళల వేషధారణలో రథీమన్మదుల దర్శనం నిమిత్తం బసవేశ్వర స్వామి ఆలయానికి వచ్చారు. అందంగా పట్టుచీర కట్టుకుని, నుదుట బొట్టు పెట్టుకుని, మెడనిండా బంగారు ఆభరణాలు ధరించి, తలనిండా పూలు, కళ్లకు అద్దాలు పెట్టుకుని, రెండు చేతులకు గాజులు వేసుకుని.. కలశం, పూజ సామగ్రితో వారు నడుస్తుంటే అసలు గుర్తుపట్టలేరు.

తీవ్రమైన కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన పేషంట్.. వీధి రౌడీలా మారిన వైద్యుడు.. కనీసం కనికరం కూడా లేకుండా..


ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే.. మహిళ వేషధారణలో ఉన్న వారు ఆలయం నుంచి తిరిగి వచ్చే క్రమంలో తమకు తెలిసిన వారిని దుర్భాషలాడడం చేస్తుంటారు. కొన్నిసార్లు ఒకరినొకరు తిట్టుకుంటూనే.. ఒకరి తప్పులు మరొకరు బయటపెట్టుకుంటారు. ఎవరికి నచ్చిన వారు.. వారిని ఆలింగనం చేసుకుంటారు. ఇలా దుర్భాషలు స్వీకరించి, ఆలింగనం చేసుకున్న వారి ద్వారా రథి, మన్మధ ఆశీర్వాదాలు అందినట్లుగా భావిస్తారట. ఇక్కడ ఇంకో నమ్మకం కూడా ఉంది. ఈ ఆచారాన్ని మొదటిసారి చూసే వారు.. అనంతర కాలంలో అవామానాలను ఎదుర్కొంటారని భావిస్తారు. తమ గ్రామంలో ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరు మగవారు మహిళల వేషంలో పూజలు చేయడం వందేళ్లుగా ఆనవాయితీగా వస్తోందని పెద్దలు చెబుతున్నారు.

అక్కడంతే.. కొత్త అల్లుడిని పారిపోకుండా పట్టుకుని, గాడిద మీద ఊరేగిస్తారట.. చివరగా వారు చేసే పనేంటో తెలుసా..

Updated Date - 2022-03-19T02:28:44+05:30 IST