అదొక్కటి చాలు!

ABN , First Publish Date - 2020-07-10T05:30:00+05:30 IST

రణభూమిలో శ్రీకృష్ణుడు చెబుతున్న స్ఫూర్తి పాఠాలు వింటున్న అర్జునుడు ‘ఈ జ్ఞానం కొత్తగా ఉంది’ అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు...

అదొక్కటి చాలు!

రణభూమిలో శ్రీకృష్ణుడు చెబుతున్న స్ఫూర్తి పాఠాలు వింటున్న అర్జునుడు ‘ఈ జ్ఞానం  కొత్తగా ఉంది’ అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు.


  • బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున
  • తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప

‘‘జ్ఞానం కొత్తదేం కాదు. జ్ఞానం ఒక ప్రవాహం. ఇంతకు ముందు సూర్యుడికి చెప్పా. సూర్యుడు మనువుకు, మనువు ఇక్ష్వాకుడికి చెప్పారు. ఇప్పుడు మళ్లీ నీకు చెబుతున్నా’’ అన్నాడు శ్రీకృష్ణుడు. అప్పుడు అర్జునుడు ‘‘నీదీ నాదీ ఒకే వయసు!. నువ్వు సూర్యుడికి ఎలా చెప్పావు?’’ అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ‘‘అర్జునా! నీకూ, నాకూ చాలా జన్మలు గడిచాయి. నువ్వు జీవుడికి కాబట్టి నీకు  తెలియడం లేదు. నాకు అవన్నీ తెలుసు’’ అన్నాడు. ఎంత పని చేసినా ఏదో కావడం లేదు అంటే జన్మాంతర గ్రహస్థితి ఏదో పీడిస్తూ ఉంటుంది. దానికి మళ్లీ పరిష్కారాలు వెతకొద్దు. కేవలం భగవన్మామస్మరణ చాలు. భగవన్మామస్మరణ నిరంతరం చేస్తే అన్ని రకాల గ్రహస్థితులూ మారిపోతాయి. 

-గరికిపాటి నరసింహారావు

Updated Date - 2020-07-10T05:30:00+05:30 IST