పులికాట్‌ సమస్యలను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-07-27T04:16:08+05:30 IST

పులికాట్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పులికాట్‌ సరస్సు సంక్షేమ సంఘం నాయకులు కలెక్టర్‌ చక్రధర్‌బాబును కోరారు. నెల్లూరులోని కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో వారు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

పులికాట్‌ సమస్యలను పరిష్కరించాలి
స్పందన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కిలివేటి, అధికారులు

‘స్పందన’లో కలెక్టర్‌కు వినతి

తడ, జూలై 26 : పులికాట్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పులికాట్‌ సరస్సు సంక్షేమ సంఘం నాయకులు కలెక్టర్‌ చక్రధర్‌బాబును కోరారు. నెల్లూరులోని కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో వారు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. సరస్సులో నెలకొన్న సరిహద్దు, స్మగ్లర్లు సరస్సులోని వానపాముల ఏరివేతపై ఫిర్యాదు చేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. అనంతరం కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఆ సంఘం అధ్యక్షుడు జయపాల్‌ మాట్లాడుతూ రెండు నెలలుగా సరిహద్దు సమస్య నెలకొని ఉందని కలెక్టర్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులకు, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు సమస్యను వివరించి వినతిపత్రాలను సమర్పించామన్నారు. నేటికీ సమస్య పరిష్కారంకాలేదని, దాంతో తాము మరోసారి కలెక్టర్‌తోపాటు ఎస్పీ,  మత్స్యశాఖ జేడీ, గూడూరు డీఎస్పీ, నాయుడుపేట ఆర్డీవోల దృష్టికి  సమస్యను తీసుకువెళ్లి వినతిపత్రాలు సమర్పించామన్నారు. అధికారులు స్పందించి న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. ఒక వేళ సమస్యను పరిష్కరించకపోతే తదుపరి కార్యచరణ రూపొందించు కుంటామన్నారు. అనంతరం ఎస్పీ విజయారావు తదితర అధికారులకు వినతిపత్రం సమర్పించారు. మత్స్యకార సంఘం నాయకులు దేశప్పన్‌, బాబు, బాలాజీ తదితరులు ఉన్నారు. 

ఓజిలి: స్థానిక తహసీల్దారు కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. ఆయనకు అర్జీదారులు వివిధ సమస్యలపై  వినతిపత్రాలను సమర్పించారు. అనంతరం పక్కనే ఉన్న తహసీల్దారు లాజరస్‌, ఎంపీడీవో రమణయ్యలతో వాటిపై చర్చించారు. సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలను  తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

నాయకులతో నిండిపోయిన స్పందన

స్పందన కార్యక్రమం వైసీపీ నాయకులతో నిండిపోయింది. మండలంలోని పలు గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఓజిలికి చేరుకోవడంతో కార్యాలయాల ఆవరణలో నాయకులు, కార్యకర్తలే కనిపించారు.  అర్జీదారులు కొందరే వచ్చారు.

నాయుడుపేట : నాయుడుపేట ఆర్డీవో కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో ఆర్డీవో సరోజిని అర్జీలను స్వీకరించారు. కొవిడ్‌ అనంతరం  పునఃప్రారంభమైన ఈ కార్యక్రమానికి డివిజన్‌లోని ఆరు మండలాల ప్రజలు అర్జీలు తీసుకొచ్చారు. నాయుడుపేట మండలం మేనకూరు గ్రామానికి చెందిన సుబ్బారావు 4.28 ఎకరాల తన భూమిని గతంలో సెజ్‌కు ఇచ్చానని, నష్టపరిహారం వచ్చేలా చొరవ చూపాలని అర్జీ సమర్పించారు. పలు భూ, ఇతర సమస్యలపై  అర్జీదారులు  వినతిపత్రాలు సమర్పించారు.




Updated Date - 2021-07-27T04:16:08+05:30 IST