చిరస్మరణీయుడు గాంధీజీ

ABN , First Publish Date - 2022-10-03T05:09:00+05:30 IST

అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం సిద్ధిం చేందుకు నిరాడంబర జీవనవిధానంతో జాతిని జాగృతం చేసిన జాతిపిత మహాత్మాగాంధీ చిరస్మరణీయుడని పలువురు వక్తలు పేర్కొ న్నారు.

చిరస్మరణీయుడు  గాంధీజీ
చీరాలలో తెల్లగాంధీ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పిస్తున్న కొండయ్య

చీరాల, అక్టోబరు 2: అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం సిద్ధిం చేందుకు నిరాడంబర జీవనవిధానంతో జాతిని జాగృతం చేసిన జాతిపిత మహాత్మాగాంధీ చిరస్మరణీయుడని పలువురు వక్తలు పేర్కొ న్నారు. ఆది వారం గాంధీజీ సందర్భంగా పలుపార్టీలు, సంఘాల ప్రతినిధులు ఆయన విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు. తెల్లగాంధీ విగ్రహం, నల్లగాంధీ విగ్రహాలకు టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎంఎం కొండయ్య, యువనేత గౌరీఅమర్‌నాధ్‌ తదితరులు పూలమాలలువేసి నివాళులు అ ర్పించారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ గాంధీ మార్గం ప్రతి ఒక్కరికి అనుసరణీయమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు జి.చం ద్రమౌళి, జనార్దన్‌, గంజి పురుషోత్తమ్‌, పార్ధసారధి, భరత్‌, రామకృష్ణ, మోహనకృష్ణ, యర్రాకుల ప్రసాద్‌, షేక్‌ మొహిద్దీన్‌, కొమ్మనబోయిన రజని, మల్లేశ్వరి, రాజేశ్వరి, రామాంజనేయులు, రబ్బానీ పాల్గొన్నారు.

మున్సిపల్‌ కార్యాలయంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి వైసీపీ ని యోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్‌ పూలమాలువేసి నివాళులర్పిం చా రు. ఈసందర్భంగా వెంకటేష్‌ మాట్లాడుతూ గాంధీజీ కలలుకన్న గ్రామస్వ రాజ్య స్ధాపనకు సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారన్నారు. కార్యక్రమంలో టీటీపీ రామకృష్ణ, సిబ్బంది, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అద్దంకి: స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో గాంధీ చిత్ర పటానికి త హసీల్దార్‌ సుబ్బారెడ్డి, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రోటరీ క్లబ్‌ ఆఫ్‌ శింగరకొండ ఆధ్వర్యంలో కొత్తపేటలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. క్లబ్‌ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీని వాసరావు, నరసింహారావు, రఫి, నర్రా శ్రీలక్ష్మి, కొల్లా భువనేశ్వరి, మన్నం త్రిమూర్తులు, తమ్మన శ్రీనివాసరావు, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, లేవి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.  కృష్ణబలిజ సంఘం ఆధ్వర్యంలో గాందీ  విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కృష్ణబలిజ  కా ర్పొరేషన్‌ డైరెక్టర్‌ అన్నపూర్ణసాయి, అయ్యప్ప, శ్రీనివాసు, వాసు గురు స్వామి తదితరులు  పాల్గొన్నారు.

చీరాలటౌన్‌: తహసీల్దార్‌ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి జీవి గుంట ప్రభాకరరావు పూలమాలవేసి నివాళులర్పించారు. నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా గాంధీజి, లాల్‌బహుదూర్‌శాస్ర్తి జయంతి వే డుకలు ఘనంగా జరిగాయి.  కార్యక్రమంలో  చుండూరి కృష్ణమూర్తి, పవ ని భానుచంద్రమూర్తి, అంజన్‌, నరేష్‌, రవికుమార్‌, రామారావు, చంద్ర మౌళి, సుబ్బరామయ్య, మహానంది, మణిబాబు తదితరులు పాల్గొన్నారు.  

పర్చూరు: పర్చూరులోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆల య సమీపంలో ఉన్న గాంధీమహాత్ముని విగ్రహానికి జూనియర్‌ సివిల్‌ జ డ్జి నాగేశ్వరరావు నాయక్‌ పూ లమాలవేసి నివాళి అర్పించా రు. అలాగే, బాలికల పాఠశా ల సమీపంలోని గాంధీ మ హాత్ముని విగ్రహానికి కూడా పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. కార్యక్రమంలో మా మిడిపాక హరిప్రసాద్‌, శ్రీరాం వెంకటసుబ్బారావు, కొత్తూరి వెంకటేశ్వర రావు, పోలిశెట్టి గురుబాబు, యం.నాగేశ్వరరావు, సుబ్బారావు, పల్లబోతు రాఘవయ్య, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బాలికల పాఠశాల సమీపంలో నివాళి అర్పించిన వారిలో కాసా అజేయ్‌బాబు, కొసనా వెం కటేశ్వర్లు, పాబోలు ఉధయభాస్కర్‌, ఒగ్గిశెట్టి నరసింహం, కోటా శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు. 


మహాత్ముని సేవలు భావితరానికి ఆదర్శనీయం

స్వర్ణ(పర్చూరు), అక్టోబరు 2 మహాత్ముని సేవలు భావితరానికి ఆదర్శ నీయమని ఎంపీపీ నీరుకట్టు వాసుబాబు అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు కారంచేడు మండలంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్వర్ణ గ్రామంలో ఎంపీపీ నీరుకట్టు వాసుబాబు నేతృత్వం లో గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మధుసూదన్‌, ఎంపీటీసీ కట్టా బాబు, కార్యదర్శి ముత్యాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఇంకొల్లు: స్థానిక కొట్లబజారులోని గాంధీవిగ్రహానికి ఆర్యవైశ్యసంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే, బీజేపీ మండ ల నాయకుల ఆధ్వర్యంలో గాంధీజికి నివాళులర్పించారు. రోటరీక్లబ్‌ ఆఫ్‌ ఇంకొల్లు సెంట్రల్‌ ఆధ్వర్యంలో పేదలైన సయ్యద్‌గాలీబ్‌, పాటిబండ్ల లక్ష్మీ లకు రెండు కుట్టు మిషన్లు అందించారు. కుట్టు మిషనకు ఆర్థికసాయం చేసిన మద్దినేని హనుమతరావు, షేక్‌ మోహిద్దీన్‌బాషా, జెట్టి వెంకటేశ్వర్లు, పులఖండం బద్రిరెడ్డి, అలవల శ్రీనివాసరెడ్డిలను క్లబ్‌ తరుపున అభినందిం చారు. కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షుడు అంజిరెడ్డి, కార్యదర్శి కరి కమలేశ్వ రరావు, సభ్యులు పాల్గొన్నారు.

చినగంజాం: తహసీల్దార్‌ కార్యాలయంలో గాంఽధీ చిత్రపటానికి ఇ న్‌చార్జ్‌ తహసీల్దార్‌ జి.ప్రభాకరరావు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కడవకుదురు గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవర ణలో గాంధీజీ చిత్రపటానికి సర్పంచ్‌ గొల్లమూరి శివకుమారి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. చినగంజాంలోని చుండిబజారులో గల వాల్మీకి సేవా సంఘంలో ఇంకొల్లు శాటిలైట్‌ ఎల్‌ఐసీ బ్రాంచి లియాఫీ అధ్యక్షుడు జి.నరసింహారావు ఆధ్వర్యంలో మహాత్మగాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి, లియాఫీ వ్యవస్థాపక దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు.  కా ర్యక్రమాల్లో ఈవోపీఆర్డీ కె.స్వరూపరాణి, వీఆర్వోలు, ఎల్‌ఐసీ ఏజెంట్లు కె.సురేషుబాబు, రవీంద్రారెడ్డి. ఎ.శ్రీనివాసరావు, పి.రమేష్‌బాబు తదితరు లు పాల్గొన్నారు. 

బల్లికురవ:  మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం వద్ద ఉన్న గాంధీజీ విగ్రహానికి ఎంపీపీ శ్రీలక్ష్మి, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ చింతల పేరయ్య, ఎంపీడీ వో సీహెచ్‌ కృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు.  బల్లికురవ ప్రా థమిక పాఠశాలలో గరిమిడి అంజయ్య జ్ఞాపకార్థం వారి కుటంబ సభ్యు లు విద్యార్థులకు సాముహిక అక్షరాభ్యాసం చేయించి పలకలు పంపిణి చేశారు. వైదన, కొప్పెరపాడు, కూకట్లపల్లి, ఉప్పుమాగులూరు తదితర గ్రా మాల్లోనూ గాంధీ జయంతి వేడుకలు జరిగాయి.

పంగులూరు: పంగులూరులో రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు పెంట్యాల జగదీ శ్వర్‌, క్లబ్‌ ప్రతినిధులు మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పంచాయతీ కార్యాలయం వద్ద విశ్రాంత బ్యాంక్‌ అధి కారి గుడిపూడి రామారావు పలువురు నేతలు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో క్లబ్‌ కార్యదర్శి కరణం హనుమంతరావు, పోతిన ప్రసాద్‌, చిలుకూరి వీరరాఘవయ్య, ఆర్వీ సుబ్బారావు, రామారావు పలువురు క్లబ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. క్లబ్‌ మాజీ అధ్యక్షుడు జాగర్లమూడి నాగేశ్వరరావు మైక్‌ సెట్‌ను క్లబ్‌కు బహూకరించారు.

సంతమాగులూరు: స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మహాత్మాగాంధీ విగ్రహానికి మండల విద్యాశాఖ అధికారి వేమవరపు కోటేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల విద్యా శాఖ కార్యాలయంలో గాంధీజీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి చిత్రపటాలకు ఎంపీడీవో సాంబశివరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

Updated Date - 2022-10-03T05:09:00+05:30 IST