Abn logo
May 9 2021 @ 01:13AM

మానవత్వం చాటుకున్న ఆపద్బాంధవ ట్రస్ట్‌ సభ్యులు

అంత్యక్రియలకు మృతదేహాన్ని తీసుకెళ్తున్న ట్రస్ట్‌ సభ్యులు

అనారోగ్యంతో అనాథ వృద్ధురాలి మృతి

అంత్యక్రియలకు ముందుకురాని గ్రామస్థులు 


వజ్రకరూరు, మే 8 : మండల కేంద్రంలో అనాథ వృద్ధురాలు బసమ్మ (70) మృతదేహానికి ఆపద్బాంధవ ట్రస్ట్‌ సభ్యులు శనివారం అంత్యక్రియ లు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. బసమ్మకు కుటుంబ సభ్యులెవ్వరూ లేరు. కొన్నేళ్లుగా ఒంటరిగా జీవిస్తోంది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండేదని  శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మృతి చెందిందని స్థానికులు తెలిపారు. కరోనా సోకిందన్న అనుమానంతో బస మ్మ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. శనివారం మధ్యాహ్నం వరకు మృతదేహాన్ని అలాగే ఉంచారు. ఈ విషయాన్ని టీడీపీ మండల నాయకుడు నాగభూషణం ఉరవకొండలోని ఆ పద్బాంధవ ట్రస్ట్‌ సభ్యులకు సమాచారమిచ్చారు. వజ్రకరూరుకు చేరుకు న్న ఆ ట్రస్ట్‌ సభ్యులు మండల కేంద్రంలోని హిందూ శశ్మానవాటికలో వృ ద్ధురాలి మృతదేహానికి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించా రు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల దృష్ట్యా సొంత  కుటుంబ  సభ్యులే మృతదేహాలను ముట్టకోవడానికి భయపడుతున్న దుస్థితి, అలాంటిది 15 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి అనాథ వృద్ధురాలి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడంతో ట్రస్ట్‌ సభ్యులను పలువురు అభినందించారు. అం త్యక్రియలు నిర్వహించడానికి పలువురు సహాయ సహకారాలు అందించారని ట్రస్ట్‌ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు జాకీర్‌, వరుణ్‌కుమార్‌, హెల్త్‌అసిస్టెంట్‌ వెంకటేశ, హెడ్‌కానిస్టేబుల్‌ శివప్రసాద్‌ పాల్గొన్నారు.