సమస్యలపై సభ్యుల గళం

ABN , First Publish Date - 2021-12-07T06:08:55+05:30 IST

నగర పాలక సంస్థ పాలకవర్గం తొలి స్టాండింగ్‌ కమిటీ సమావే శంలో సభ్యులు గళమెత్తారు. సోమవారం నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం చాంబర్‌లో సమావేశం నిర్వహించారు.

సమస్యలపై సభ్యుల గళం
స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో పాల్గొన్న నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం



డబుల్‌ కనెక్షన, అసెస్‌మెంట్ల సమస్యలు పరిష్కరించండి

సబ్‌ లీజులపై నిలదీత

స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో చర్చ



అనంతపురం కార్పొరేషన, డిసెంబరు 6: నగర పాలక సంస్థ పాలకవర్గం తొలి స్టాండింగ్‌ కమిటీ సమావే శంలో సభ్యులు గళమెత్తారు. సోమవారం నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం చాంబర్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్‌తో పాటు నగర కమిషనర్‌ పీ వీవీఎస్‌ మూర్తి, స్టాండింగ్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సభ్యుడు బాలాంజనేయులు మాట్లాడుతూ నగరంలో ఒకే ఇంటికి రెండు డోర్‌ నెంబర్ల పేరుతో డబుల్‌ ట్యాక్స్‌ పడు తోందని అలాంటి డబుల్‌ అసె్‌సమెంట్లపై ఎందుకు చర్య లు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కుళాయి కనెక్షన్లలో డబుల్‌ ఉన్నట్లు ఆనలైనలో చూపిస్తున్నాయని, వాటిని తొలగించకపోతే ప్రజలకు ఇబ్బందులు తప్పవన్నారు. అడి షనల్‌ కమిషనర్‌ రమణారెడ్డి స్పందిస్తూ వాటిపై దృష్టి సారిస్తున్నామని, కమిషనర్‌ లాగినలో వాటిని తొలగించ వచ్చని, చర్యలు చేపడతామన్నారు. మరో సభ్యుడు సైఫు ల్లాబేగ్‌ మాట్లాడుతూ టవర్‌క్లాక్‌ సమీపంలోని మున్సిపల్‌ కాంప్లెక్స్‌లో సబ్‌ లీజులపై ఎందుకు  చర్యలు తీసుకోలే దని, వాటిని రద్దు చేయాలని కోరారు. నగరంలో మున్సి పల్‌ దుకాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పాలన్నారు. ఇందుకు కమిషనర్‌ మాట్లాడుతూ... రెండు నెలల్లో వాటిపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటామని, అలాంటి వాటిని రద్దు చేస్తామన్నారు. సభ్యురాలు బండి నాగ మణి మాట్లాడుతూ నగరంలో నీటి కుళాయిల విష యంలో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.  కార్పొరేషన కార్యాలయంలో కనీసం కార్పొరేటర్లు కూర్చోవడానికి కూడా ప్రత్యేక గది లేదని సభ్యులు విమర్శించారు. మహిళా కార్పొరేటర్లు  27మంది ఉన్నారని, కనీసం వాష్‌రూమ్‌ ఉన్న గది లేదని, ఓ గది కేటాయిం చాలన్నారు. ఇందుకు డీఈ నరసింహ స్పందిస్తూ పై అం తస్తులో ఓ గదిని పరిశీలిస్తున్నామన్నారు. అనంతరం మే యర్‌ వసీం మాట్లాడుతూ సభ్యులు అడిగిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.


Updated Date - 2021-12-07T06:08:55+05:30 IST