ధాన్యం కొనుగోలు అక్రమాలపై సభ్యుల ఆగ్రహం

ABN , First Publish Date - 2021-05-08T06:29:38+05:30 IST

ధాన్యం కొనుగోలులో జరిగిన అక్రమాలపై వెంటనే విచారణ చేపట్టాలని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధాన్యం కొనుగోలు అక్రమాలపై సభ్యుల ఆగ్రహం
జడ్పీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌ కొరిపల్లి విజయలక్ష్మి, వేదికపై జిల్లా అధికారులు

వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి   

సకాలంలో వైద్య సేవలు అందజేయాలి

జడ్పీ సర్వసభ్య సమావేశంలో సభ్యుల డిమాండ్‌

నిర్మల్‌, మే 7 (ఆంరఽధజ్యోతి) : ధాన్యం కొనుగోలులో జరిగిన అక్రమాలపై వెంటనే విచారణ చేపట్టాలని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని దివ్యగార్డెన్‌లో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కొరిపెల్లి విజయలక్ష్మి అధ్యక్షతన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్ర భుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అనేక అక్రమాలు జరి గినప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభ దృష్టికి తీసుకువచ్చారు. అకాలవర్షంతో రైతులు ఎంతో నష్ట పోయారని, నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కోవిడ్‌ రోజు రోజుకూ పెరిగిపోతుండగా ఎందరో మంది ప్రాణాలు సైతం పోవడం జరుగుతుందని, కొవిడ్‌ రోగులకు సకాలంలో వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్‌ సంబంధించిన కిట్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోవడం జరుగుతుందని సభ్యులు సమస్యను సభ దృష్టికి తీసుకు వచ్చారు. అదే విధంగా ధాన్యం కొనుగోలులో అనేక కొతలు విధిస్తూ రైతులు నష్టపోవడం జరుగుతుందని సభ్యులు విన్నవించారు. జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ మాట్లాడుతూ కోవిడ్‌ వ్యాక్సిన్‌పై ప్రజల్లో ఉన్న అపోహలు విడ నాడి అందరూ టీకా తీసుకునే విధంగా అవగాహన పెంపొందించవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, జడ్పీ సీఈవో సుధీర్‌, జడ్పీటీసీలు, కోఆప్షన్‌ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

రెండోసారి వ్యాక్సిన్‌ కోసం ఇబ్బందులు తప్పడం లేదు

రెండోసారి వ్యాక్సిన్‌ తీసుకోవడం కోసం మారుమూల ప్రాంత ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారు. రెండోసారి వ్యాక్సిన్‌ కోసం ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ నిబంధనలు తీసుకురావడంతో అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అక్షరాలు రాని గిరిజనులు ఈ సమస్యతో సతమతమవుతున్నారు. వ్యాక్సిన్‌పై కొత్త నిబంధనలు తీసివేయాలి.

Updated Date - 2021-05-08T06:29:38+05:30 IST