కరుగుతున్న స్ట్రయిట్‌ కట్‌

ABN , First Publish Date - 2022-06-25T05:30:00+05:30 IST

చీరాల మండల పరిధిలోని ఈపూరుపాలెం స్ట్రయిట్‌ కట్‌ నుంచి అడ్డ గోలుగా ఇసుకను తరలిస్తున్నారు.

కరుగుతున్న స్ట్రయిట్‌ కట్‌
కరుగుతున్న స్ట్రయిట్‌ కట్ట

అడ్డగోలుగా ఇసుక ఆక్రమ రవాణా

ఇలాగే కొనసాగితే ఊరు మీదకు సముద్రం విరుచుకుపడే అవకాశం

 ప్రమాదాల మాటున తోటవారిపాలెం 

 పలుమార్లు అధికారులను ఆశ్రయించిన గ్రామస్థులు

నిమ్మకు నీరెత్తినట్టుగా  వ్యవహరిస్తున్న వైనం

తోటవారిపాలెం (చీరాల టౌన్‌), జూన్‌ 25: చీరాల మండల పరిధిలోని ఈపూరుపాలెం స్ట్రయిట్‌ కట్‌ నుంచి అడ్డ గోలుగా ఇసుకను తరలిస్తున్నారు. దీంతో రోజురోజుకు కట్ట బలహీన పడుతోంది. ఈక్రమంలో తోటవారి పాలెంకు ప్రమాదం పొంచి ఉంది. తోటవారి పాలెం, ఈపూరుపాలెం గ్రామాల్లోని వేలాది ఎకరాల పంట పొలాల్లోని మురుగునీరు, వర్షాకాలంలో వరద నీటిని సముద్రంలోకి తరలించేందుకు ఈపూరుపాలెం స్ట్రయిట్‌ కట్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంది.  ఈ కట్టకు ఉ న్న ఇసుకను అక్రమార్కులు నిత్యం అర్ధరాత్రి సమయంలో రోజుకు సుమారు 50 ఎడ్లబండ్ల వరకు తరలిస్తున్నారు. ఇప్పటికే సుమారు కిలో మీటరు మేరకు తవ్వకాలు జరిగాయి. ఈక్రమంలో క్రమేపీ కొంచెం కొం చెంగా కట్ట తరిగిపోతుండటంతో ఆటు, పోటు సమ యంలో సముద్రపు నీరు కట్టకు ఆనుకుని ఉన్న పంట పొలాల మీదకు దూకే అవకాశం ఉంది. దీంతో పొ లాలను నమ్ముకుని సాగుచేసుకుంటున్న రైతులు భయాందోళన చెందుతున్నారు. దీనికితోడు కట్ట నేలకు సమాంతరంగా మారుతుం డటంతో ఆటు, పోట్లు సమయంలో సముద్రపు నీరు గ్రామంలోకి చేరితే  పూర్తిగా జలమయ మయ్యే ప్రమాదం ఉంది.


అడ్డుగా రాళ్లు ఏర్పాటుచేసిన గ్రామస్థులు

ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకొనేం దుకు స్థానికులు తమవంతు ప్రయత్నాలు చేశారు. అక్కమార్కులు ఏర్పాటుచేసుకున్న బళ్ల బాటను పూర్తిగా మూసేందుకు ఎనిమిది అడుగుల రాళ్లును అడ్డుగా ఏర్పాటుచేశారు. అయితే, సముద్రాలు మింగే వారికి పిల్ల కాలువలు ఒక లెక్కా అన్నచందంగా వాటిని అర్ధరాత్రి పీకి పక్కన పడవేసి  రవాణా సాగిస్తున్నారు. 

ఈ మార్గంలో ఇటీవల ఉపాఽధిహామీ పనులతో పంట కాలువ పూడిక తీసిన దానిని కూడా వారికి అనుకూలంగా పూడ్చుకుని ఇసుకను తోలుకుంటు న్నారు. దీంతో చేసేదేమీ లేక పలుమార్లు పోలీస్‌, రెవెన్యూ అండ్‌ సెబ్‌ అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎటువంటి స్పందన లేదు.  స్థానిక అధికారులు స్పం దించకపోవడంతో జిల్లా అధికారులను ఆశ్రయించే యోచనలో గ్రామస్థులు ఉన్నారు.


తోటవారిపాలెంకు పొంచిఉన్న ప్రమాదం

- గుమ్మడి సంజీవరావు, గ్రామ రైతు

అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణా సాగుతుండటంతో స్ట్రయిట్‌ కట్‌ పూర్తి గా బలహీన పడుతోంది. ఇదేరీతిగా సాగితే సముద్రంపు నీరు తగిలితే పంటలు సరిగ్గా పండే అవకాశం ఉండదు. అంతేకాకుండా కట్ట బలహీ నతకు సముద్రం నీరు ఊరిమీదకు చేరే అవకాశం ఉంది. తద్వారా ఊరంతా కొట్టుకుపోతుంది. ప్రమాదం జరగకముందే ముందస్తు చర్యలు తీసుకోవాలని పలుమార్లు ఈపూరుపాలెం పోలీసులకు ఫిర్యాదులు చేశాం. సెబ్‌ అధికారులకు ఫిర్యాదులు చేశాం. నేటికీ ఇసుక అక్రమ రవాణా ఆగలేదు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి దీనికి అడ్డుకట్ట వేయాలి.

Updated Date - 2022-06-25T05:30:00+05:30 IST