పోలీస్‌ శాఖలో కొలువుల మేళా

ABN , First Publish Date - 2022-04-26T07:08:01+05:30 IST

ప్రభుత్వం ఎట్టకేలకు పోలీసుశాఖలో కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వచ్చే నెలలో దరఖాస్తులను స్వీకరించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను సైతం చేసింది. ఈ మేరకు రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా ఈ నోటిఫికేషన్‌ జారీ అయ్యిం ది. ప్రభుత్వం ప్రకటించిన

పోలీస్‌ శాఖలో కొలువుల మేళా

ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేసిన పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు

జిల్లాలో 400 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ

అందులో సివిల్‌ కానిస్టేబుళ్లు 266, ఏఆర్‌ కానిస్టేబుళ్లు 134

కొత్త జోన్‌ల ఆధారంగా పోస్టుల భర్తీ

బాసర జోన్‌ పరిధిలో 36 ఎస్సై పోస్టులు

నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, జగిత్యాల, నిర్మల్‌ పరిధిలో 30 సివిల్‌, 3 ఏఆర్‌, 3 స్పెషల్‌ ప్రొటక్షన్‌ ఫోర్స్‌ల ఎస్సైలు

మే 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ 

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మూడేళ్ల వయసు సడలింపు

జిల్లాలో పోస్టుల భర్తీకి స్థానిక యువతకే 95 శాతం అవకాశం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రభుత్వం ఎట్టకేలకు పోలీసుశాఖలో కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వచ్చే నెలలో దరఖాస్తులను స్వీకరించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను సైతం చేసింది. ఈ మేరకు రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా ఈ నోటిఫికేషన్‌ జారీ అయ్యిం ది. ప్రభుత్వం ప్రకటించిన విధంగానే ఈ పోస్టులకు వయసు సడలింపు కూడా మూడేళ్ల పాటు ఇచ్చారు. దరఖాస్తు చేసిన మూడు నెలల్లోనే ప్రిలిమినరీ పరీక్ష ను నిర్వహిస్తారు. అంతేకాకుండా నిరుద్యోగులకు జోష్‌ కల్పించే విధంగా జిల్లా, జోన్‌ల వారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్న ట్లు ప్రకటించగడం గమనార్హం. కొత్త జోన్‌ల ప్రకారమే నియామకం చేస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

జిల్లాల వారీగా కానిస్టేబుల్‌ పోస్టులు

రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు కానిస్టేబుల్‌, ఎస్సైల నియామకం కోసం సోమవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రస్థాయిలో 15644 కానిస్టేబు ల్‌, 554 ఎస్సైల పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించా రు. అయితే, కానిస్టేబుల్‌ పోస్టులను జిల్లాల వారీగా భర్తీ చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని యువకులకే 95 శాతం కొత్త జోన్‌ల ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో ఇచ్చిన ఈ నోటిఫికేషన్‌లో స్టైఫండరి ట్రైనీ సివి ల్‌ కానిస్టేబుల్‌, స్టైఫండరీ ట్రైనీ ఏఆర్‌ కానిస్టేబుల్‌, స్టైఫండరి సీపీఎల్‌ కానిస్టేబు ల్‌, స్టైఫండరి క్యాడెట్‌ ట్రైనింగ్‌ టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ ఇన్‌ తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, అగ్నిమాపక శాఖలో ఫైర్‌మన్‌ విభాగం, జైల్‌లో వార్డెన్‌ల పోస్టుల ను భర్తీ చేయనున్నట్లు ఈ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్‌ ప్ర కారం జిల్లాలో సివిల్‌ కానిస్టేబుల్‌ 266, ఏఆర్‌ కానిస్టేబుల్‌ 134 భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఈ నోటిఫికేషన్‌ ఆధారంగా మొత్తం 400 కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ యేయనున్న ట్లు పేర్కొన్నారు. ఇవేకాకుండా స్పెషల్‌ ఫోర్స్‌లో స్టేట్‌జోన్‌గా మిగతా కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ చేయనున్నట్లు నోటిపికేషన్‌లో పేర్కొన్నారు. బాసర జోన్‌ పరిధిలో మొత్తం 36 ఎస్సై పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ జోన్‌ పరిధి లో నిజామాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, ఆదిలాబాద్‌ ఉన్నాయి. వీటి పరిధిలో 30 సివిల్‌, మూడు ఏఆర్‌, 3 స్పెషల్‌ ప్రొటక్షన్‌ ఫోర్స్‌లో ఎస్సై పోస్టులను భర్తీచేయనున్నట్లు ఈ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 

నోటిఫికేషన్‌లో వయసు సడలింపు

పోలీసు శాఖలో పోస్టులకు వయసు సడలింపు కూడా ఇచ్చారు. వీటితో పాటు బీసీ, బీసీ-ఏ, బీసీ-బీ, బీసీ-సీ, బీసీ-డీ, బీసీ-ఈ, స్పోర్ట్స్‌, ఎకనామికల్‌ సెక్షన్‌లకు రిజర్వేషన్‌లు కల్పిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కానిస్టేబుల్‌ పోస్టులకు వయసు సడలింపు జనరల్‌ 18 నుంచి 22ఏళ్ల మధ్య ఉండాలని పేర్కొన్నారు. వీరు 2 జూలై 2000 నుంచి 1 జూలై 2004 మధ్య జన్మించి ఉండాలని పేర్కొన్నా రు. ఇదే కాకుండా ప్రభుత్వం సడలింపు ఇచ్చిన విధంగా మూడేళ్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. దీని ప్రకారం 25ఏళ్ల వరకు కానిస్టేబుల్‌ పోస్టులకు పోటీ పడేందు కు జనరల్‌ వారికి అవకాశం కల్పించారు. వీరితో పాటు వివిధ కేటగిరిలకు వయస్సు రిలాక్సేషన్‌ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. హోంగార్డు 40 ఏళ్లలోపు ఉన్న వారికి కూడా అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎక్స్‌ సర్వీస్‌మన్‌కు నిబంధనల మేరకు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్సై అభ్యర్థులకు 25ఏళ్ల వరకు గతంలో ఉండగా.. ప్రస్తుతం సడలింపు తో 28ఏళ్ల వరకు అవకాశం కల్పిస్తున్న ట్లు పేర్కొన్నారు. జనరల్‌ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం జూలై 1, 2022 వర కు 28ఏళ్లు మించకుండా ఉండాలని తెలిపారు. ఇతర అభ్యర్థులకు వారి కేటగిరి ప్రకారం రిజర్వేషన్‌లు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఈ పోస్టుల కోసం మే 2నుంచి 20 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అభ్య రు ్థలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని కోరారు. కానిస్టేబుల్‌ అభ్యర్థులకు జనరల్‌, బీసీ వారి కోసం రూ.800 ఫీజు చెల్లించాలని పోలీసు నోటిషికేషన్‌లో పేర్కొన్నా రు. ఇతర వర్గాలకు నిబంధనల మేరకు చెల్లింపులు చేయాల్సి ఉటుంది. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మూడు నెలల్లో ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్టులను నిర్వహించనున్నారు. 

రెండు విడతలుగా పరీక్షల నిర్వహణ

పోలీస్‌ కానిస్టేబుల్‌, ఎస్సై పరీక్షలు రెండు విడతలుగా జరగనున్నాయి. మొదట ప్రిలిమినరి టెస్టు నిర్వహిస్తారు. 200 మార్కులతో నిర్వహించే ఈ పరీక్ష ల్లో 30శాతానికి పైగా వచ్చిన వారిని అర్హులుగా నిర్ణయిస్తారు. ఈ పరీక్ష కాగానే ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్టు ఉంటుంది. ఈ టెస్టు తర్వాత అర్హత పొందిన వారికి ఫైనల్‌ పరీక్ష ఉటుంది. ఇందులోనూ 200 మార్కులు ఉంటాయి. ఈ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. ఈ పోస్టుల భర్తీలో రిటన్‌తో పాటు కీలకమైనది ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ పరీక్షలు. వీటిని సక్రమంగా చేసిన వారికి పోస్టులు దక్కుతాయి. కానిస్టేబుల్‌ పోస్టులకు ఇంటర్మీడియట్‌, ఎస్సై పోస్టులకు డిగ్రీ అర్హతగా నిర్ణయించారు. స్థానికత ఆధారంగా కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎస్సై పోస్టులను జోనల్‌ పరిధిలో చేయనున్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల కావడంతో జిల్లా నుంచి పోటీ భారీగా ఉండనుంది. ఈ పోస్టులపై ఆశలు పెట్టుకున్న వేలాది మంది యువకు లు ఇప్పటికే ప్రిపరేషన్‌ను మొదలుపెట్టారు. కానిస్టేబుల్‌తో పాటు ఎస్సై కోసం శిక్షణ తీసుకుంటున్నారు. నోటిఫికేషన్‌ విడుద ల కావడంతో మరింత ఎక్కువగా ప్రిపరేషన్‌ కొనసాగించనున్నారు. ప్రభుత్వం ఒకేసారి భారీగా నోటిఫికేషన్‌లు విడుదల చేస్తుండడంతో జిల్లాలో పోలీసుశాఖ తరపున శిక్షణను కూడా ప్రారంభించారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి తన నియోజకవర్గంలో యువత కోసం శిక్షణను ఏర్పాటు చేశారు. ఇవేకాకుండ ఎస్సీ, ఎస్టీ, బీసీ అకాడమీల ద్వారా కూడా శిక్షణను అందిస్తున్నారు. నాలుగేళ్ల తర్వాత కానిస్టేబుల్‌ల రిక్రూట్‌మెంట్‌, ఎస్సైల రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్‌ రావడంతో భారీగానే దరఖాస్తులు చేయనున్నా రు. ఇప్పటికే జిల్లాలో ఉచిత శిక్షణ ప్రారంభించామని నగర పోలీస్‌ కమిషనర్‌ కేఆర్‌.నాగరాజు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగు లు అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. 

Updated Date - 2022-04-26T07:08:01+05:30 IST