Abn logo
Jul 27 2021 @ 16:08PM

ఏపీలో 2 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు: మేకపాటి

అమరావతి: ఏపీలో 2 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. త్వరలో ప్రత్యేక లాజిస్టిక్ పాలసీ-2021ను అమలులోకి తేనున్నట్లు వెల్లడించారు. లాజిస్టిక్ పాలసీ -2021 పై ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలో ఈజ్ ఆఫ్ లాజిస్టిక్స్ ఉంటుందన్నారు. మౌలిక సదుపాయలకు పెద్దపీట వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మంత్రి మేకపాటి అధ్యక్షతన పరిశ్రమల శాఖపై సమీక్ష నిర్వహించారు.