Abn logo
Jul 1 2020 @ 03:14AM

రాష్ట్రంలో జపాన్‌ పెట్టుబడులు: మేకపాటి

రాష్ట్రంలోని 10 రంగాలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌కు చెందిన సంస్థలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయం నుంచి జపాన్‌ సంస్థలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దీనిలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌(జేబీఐసీ), జపాన్‌ ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్‌ ఏజెన్సీ(జైకా), ప్రీమియర్‌ జపాన్‌ డెవల్‌పమెంట్‌ ఏజన్సీ, కునియమి అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌ సంస్థలు పాల్గొన్నాయి. రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులకు ఈ సంస్థలు సిద్ధమైనట్టు మంత్రి తెలిపారు. ఇక, అమరావతిలో నిర్మించాలని ప్రతిపాదించిన పెవిలియన్‌ను విశాఖలో నిర్మించేందుకు పెట్టుబడి పెట్టనున్నాయని చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement