మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్లో రూపొందనున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘భోళా శంకర్’ చిత్రం నవంబర్ 11వ తేదీన హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైన విషయం తెలిసిందే. క్రియేటివ్ కమర్షియల్స్ సహకారంతో ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు క్లాప్ కొట్టగా.. మరో దర్శకుడు వివి వినాయక్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. కొరటాల శివ, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, బాబీ, గోపీచంద్ మలినేని, ఎన్ శంకర్, రైటర్ సత్యానంద్ కలిసి స్క్రిప్ట్‌ను మేకర్స్ కి అందజేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియాలో సమావేశంలో చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ..‘‘ఏడాదిన్నర పాటు ఎంతో కష్టపడి ఈ స్ర్కిప్ట్ రెడీ చేశాం. అనిల్ గారు, నేను కలిసి మొదట చిరంజీవిగారిని కలిసినప్పుడు ఎంత ఎనర్జీతో ఉన్నామో.. ఇప్పుడూ అలాగే ఉన్నాం. సత్యానంద్‌గారి ఆధ్వర్యంలో స్క్రిప్ట్ వర్క్ చేశాం. ఇది మంచి కథ, సిస్టర్ సెంట్రిక్ కథ. క్రియేటివ్ కమర్షియల్ రామారావుగారు నన్ను కన్నడలో దర్శకుడిగా పరిచయం చేశారు. బాస్ సినిమాతో మళ్లీ ఇలా కలవడం ఆనందంగా ఉంది. చిరంజీవిగారితో ఆయన ఎన్నో బ్లాక్బస్టర్లు తీశారు. ఆయనతో కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. చిరంజీవిగారితో సినిమా చేయాలనేది నా డ్రీమ్. ఇన్నేళ్ల గ్యాప్ తరువాత మంచి కథతో రావాలి.. చిరంజీవితో కలిసి రావాలని అనుకున్నాను. నా శక్తినంతా ఇందులో పెడతాను. కమర్షియల్‌గా అందరికీ నచ్చేలా చేస్తాను. తమన్నా చాలా బిజీగా ఉంది. ఎన్నో సినిమాలు చేస్తోంది. అయినా నేను అడగగానే ఓకే చెప్పినందుకు ఆమెకు థ్యాంక్స్. సిస్టర్ పాత్రకు కీర్తి సురేష్ ఓకే అయ్యింది. అయితే కథ చెప్పేటప్పుడే తమన్నా అని అందరికీ చెప్పాను. ఎలా అయినా సరే మాకు డేట్స్ ఇవ్వమని తమన్నాను అడిగాం. ఇందులో సాంగ్స్ ప్రత్యేకంగా ఉండబోతోన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్‌గా సాగర్ని అనుకున్నాను అంటే.. అనిల్‌గారు, చిరంజీవిగారు వెంటనే ఓకే చెప్పారు. అందరూ అన్నయ్యను భోళా శంకరుడు అని అంటుంటారు. ఆయన పేరులో కూడా ఉంటుంది. ఇదే ఈ చిత్రానికి టైటిల్‌గా పెట్టడంతో వైబ్రేషన్స్ మారిపోయాయి. మీడియా మద్దతు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.