కేంద్ర ప్రభుత్వంపై మేఘాలయ గవర్నర్ ఘాటు వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-11-07T23:52:32+05:30 IST

సత్యపాల్ మాలిక్ క్రితం జమ్మూ కశ్మీర్ గవర్నర్‌గా పని చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో పాటు అనంతరం దేశాన్ని కుదిపివేసిన ఆ పరిణామాలను సత్యపాల్ మాలిక్ దగ్గర ఉండి చూసుకున్నారు. అనంతరం ఆయనను మేఘాలయ గవర్నర్‌గా బదిలీ చేశారు..

కేంద్ర ప్రభుత్వంపై మేఘాలయ గవర్నర్ ఘాటు వ్యాఖ్యలు

జైపూర్: ఒక జంతువు చనిపోతే సంతాపాలు ప్రకటించిన ఢిల్లీ నేతలు 600 మంది రైతులు చనిపోతే ఒక్క మాటైనా మాట్లాడటం లేదని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఘాటుగా స్పందించారు. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుతో పాటు ఇతర రాష్ట్రాల్లో కొనసాగుతోన్న నిరసనలను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘రైతు ఉద్యమంలో ఇప్పటి వరకు 600 మంది చనిపోయారు. ఒక జంతువు చనిపోయినప్పుడు ఢిల్లీ నేతలంగా సంతాపాలు వ్యక్తం చేశారు. మరి 600 రైతుల ప్రతిపాదనను లోక్‌సభ ఎందుకు ఇప్పటి వరకు ఆమోదించలేదు?’’ అని అన్నారు.


గతంలో జమ్మూ కశ్మీర్ గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్ పని చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో పాటు అనంతరం దేశాన్ని కుదిపివేసిన ఆ పరిణామాలను సత్యపాల్ మాలిక్ దగ్గర ఉండి చూసుకున్నారు. అనంతరం ఆయనను మేఘాలయ గవర్నర్‌గా బదిలీ చేశారు. కాగా, ఆయన కొద్ది రోజుల క్రితం ఒక సంచలన విషయాన్ని చెప్పారు. జమ్మూ కశ్మీర్‌ గవర్నర్‌గా ఉన్నప్పుడు తనకు లంచం ఇవ్వాలని కొందరు ప్రయత్నించారని దాంట్లో అధికార పార్టీ నేతలు కూడా ఉన్నారని సత్యపాల్ మాలిక్ అన్నారు.

Updated Date - 2021-11-07T23:52:32+05:30 IST