Abn logo
Jul 8 2020 @ 07:18AM

న‌టిని వెంబ‌డించిన వీధి కుక్క‌లు... తరువాత‌...

హిందీ టీవీ నటి మేఘా గుప్తా ఇటీవల ఒక‌రోజు ఉదయం వ‌ర్క్అవుట్‌కు వెళుతున్న‌ సమయంలో ఒక విచిత్ర‌మైన‌ పరిస్థితిలో చిక్కుకున్నారు. ఆ స‌మ‌యంలో ఆమెను కొన్ని కుక్కలు చుట్టుముట్టాయి. ఆ తర్వాత ఆమె వాటి నుంచి ఎలా త‌ప్పించుకున్నార‌నే విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల‌తో షేర్ చేసుకున్నారు. అటవీ ప్రాంతానికి వెళ్లి స్వచ్ఛమైన గాలిని, సహజ వాతావరణాన్ని ఆస్వాదించడానికి వెళ్లాల‌ని మేఘా అనుకుంది.  అక్కడ ఆమె వ్యాయామం కూడా చేయాలని నిర్ణయించుకుంది. ఇదే ఆమెను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. దీని గురించి మేఘా ఇన్‌స్టాగ్రామ్‌లో.... తాను చెట్ల మ‌ధ్య చెమ‌ట ప‌ట్టేలా కొన్ని వ్యాయామాలు చేశాన‌ని, అక్క‌డి ప్ర‌కృతిని ఆస్వాదించాన‌ని తెలిపింది. ఇంటికి ర‌న్నింగ్ చేస్తూ తిరిగివ‌స్తుండ‌గా,  ఏకంగా ఆరు కుక్క‌లు త‌న‌ను వెంబడించాయ‌ని, వాటిలో రెండు కుక్క‌ల‌ను త‌రిమి కొట్టిన‌ప్ప‌టికీ, మిగిలిన‌వి త‌న‌ను భయ‌పెట్టాయ‌ని తెలిపింది. అయితే ఇంత‌లో అటుగా స్కూట‌ర్‌మీద వ‌చ్చిన ఒక వ్య‌క్తి త‌న‌ను కాపాడార‌ని పేర్కొంది. 

Advertisement
Advertisement
Advertisement