Oct 23 2021 @ 13:39PM

మనసు మార్చుకున్న మెగాస్టార్.. ముందు బాబీ తర్వాత మెహర్ రమేశ్..?

ప్రస్తుతం తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా 'గాడ్ ఫాదర్' మూవీ తెరకెక్కుతోంది. శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. దీని తర్వాత మెహర్ రమేశ్ దర్శకత్వంలో 'భోళా శంకర్' సినిమాను పట్టాలెక్కించాలనుకున్నారు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్‌గానిలిచిన 'వేదాళం'కు రీమేక్. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఇందులో స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ మెగాస్టార్‌కు చెల్లిగా నటిస్తోంది. దీని తర్వాత బాబీ దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టాలనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ఆర్డర్ విషయంలో మెగాస్టార్ మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. రెండు రీమేక్ సినిమాలను వరుసగా కాకుండా మధ్యలో ఓ స్ట్రైట్ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట చిరు. అందుకే ఇప్పుడు వరుసలో బాబీ ముందుకు వచ్చి మెహర్ రమేశ్ వెనక్కి వెళ్ళినట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలో ఓ క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. కాగా కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న 'ఆచార్య' వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్. మణిశర్మ సంగీత దర్శకుడు.