Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 08 Oct 2021 14:26:24 IST

మెగాస్టార్ మరో రీమేక్ చేయక తప్పదా?

twitter-iconwatsapp-iconfb-icon
మెగాస్టార్ మరో రీమేక్ చేయక తప్పదా?

మలయాళ ప్రముఖ కథానాయకుడు మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ రూపొందించిన చిత్రం `లూసిఫర్`. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు `గాడ్ ఫాదర్` అనే టైటిల్ ఖరారు చేశారు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ఊటీలో మొదలైంది. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.


కాగా, `లూసిఫర్`కు సీక్వెల్‌గా మలయాళంలో మరో సినిమా తెరకెక్కుతోంది. నిజానికి ఇది సీక్వెల్ కాదు.. ప్రీక్వెల్ అని చెప్పాలి. లూసిఫర్ సినిమా క్లైమాక్స్‌లో మోహన్ లాల్ ఒరిజినల్ కేరక్టర్ రివీల్ అవుతుంది. అసలు మోహన్ లాల్ పాత్ర నేపథ్యం ఏంటి? మోహన్ లాల్, పృథ్వీరాజ్ మధ్య పరిచయం ఎలా మొదలైంది? అనే కోణంలో కథ ఉండబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా అడుగు ముందుకు పడలేదు. త్వరలోనే ఈ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను కూడా మెగాస్టార్ తెలుగులోకి రీమేక్ చేస్తారని అప్పుడే ప్రచారం జోరందుకుంది. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement