Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 07 Jul 2022 09:15:44 IST

Bhola Shankar: రిలీజ్‌కి ప్లాన్ రెడీ చేస్తున్న మెగాస్టార్..?

twitter-iconwatsapp-iconfb-icon

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో మెహర్ రమేశ్ (Mehar Ramesh) దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భోళా శంకర్' (Bhola Shankar) సినిమా కూడా ఒకటి. ఈ సినిమా షూటింగ్ చక చకా జరుగుతోంది. తమిళ సూపర్ హిట్ మూవీ 'వేదాళం' (Vedalam) సినిమాకి అధికారిక రీమేక్ గా ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీని తెలుగు నేటివిటీకి, మెగాస్టార్ ఇమేజ్‌కు సరిపోయేలా కథలో కొన్ని కీలక మార్పులు చేర్పులు చేశారు.

భోళా శంకర్ సినిమాలో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannah) హీరోయిన్‌గా.. చిరు చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ (Keerthi Suresh) కనిపించనుంది. అయితే, ఈ ఏడాది చివరిలో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ రిలీజ్ ప్లాన్ మారినట్టు తెలుస్తోంది. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ (God Father) సినిమాలో చిరు పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మోహన్ రాజా (Mohan Raja) తెరకెక్కిస్తున్న ఈ మూవీలో నయనతార, సల్మాన్ ఖాన్, పూరి జగన్నాథ్, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ మూవీని దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  

ఆ తర్వాత యువ దర్శకుడు బాబీతో మెగాస్టార్ చేస్తున్న 154వ సినిమా రిలీజ్ ఉండబోతుంది. ప్రస్తుతం ఈ మూవీకి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఇందులో మెగాస్టార్ ఊర మాస్ రోల్ చేస్తుండగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని 2023, సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. అయితే మెహర్ రమేష్ తో మెగాస్టార్ చేస్తున్న భోళా శంకర్ ని వచ్చే ఏడాది ఉగాదికి రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే దసరా, సంక్రాంతి, ఉగాది పండుగలకు భారీ స్థాయిలో మెగా ట్రీట్ ఉండబోతుందని ఫిక్సవ్వచ్చు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement