Abn logo
Nov 30 2020 @ 03:33AM

మెగా ‘సిస్టర్స్‌’... పెళ్లి సందడి!

మెగా కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. నటుడు, నిర్మాత నాగబాబు కొణిదెల కుమార్తె నిహారిక వివాహం డిసెంబర్‌ 9న ఉదయ్‌పూర్‌లో చైతన్య జొన్నలగడ్డతో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి పనులు, సంబరాలు మొదలయ్యాయి. పెళ్లికి ముందు మెగా కుటుంబంలో అమ్మాయిలందరూ కలిశారు. ఇటీవల చిరంజీవి కుమార్తెలు సుస్మితా కొణిదెల, శ్రీజ సహా నిహారిక, అలాగే కజిన్స్‌ దీప్తి తదితరులు క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ చేశారు. ‘సెలబ్రేషన్స్‌ బిగిన్‌... సిస్టర్స్‌’’ అని సుస్మితా కొణిదెల పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement