Abn logo
May 21 2020 @ 22:02PM

ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

ఈ ఫొటోల్లో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? టాలీవుడ్‌లో మెగా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ త్వరలో మెగాస్టార్ సినిమాలో కూడా ఓ సాంగ్‌తో రాబోతుంది. ఇంతకీ ఎవరో ఈ భామ అర్థమైందిగా? రెజీనా కసండ్రా. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న ‘ఆచార్య’లో ఓ స్పెషల్ సాంగ్ చేసిన రెజీనా.. ఆ సాంగ్‌తో మళ్లీ తనకు మంచి రోజులు వస్తాయని భావిస్తుంది. అయితే ఈ లాక్‌డౌన్‌లో ఈ భామ ఎవ్వరూ గుర్తుపట్టలేనట్లుగా తయారైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరూ ఈ ఫొటోలను షేర్ చేస్తూ.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.


ఇక రెజీనా విషయానికి వస్తే.. ప్రస్తుతం టాలీవుడ్‌లో అవకాశాలు లేని రెజీనా.. అవకాశాలు లేకపోయినా పరవాలేదు కానీ.. మంచి పాత్రలు వస్తేనే చేస్తానంటుంది. ఒకప్పుడు ఫుల్ బిజీ హీరోయిన్‌గా అవకాశాలు పట్టేసిన రెజీనా.. స్టార్ హీరోయిన్ స్టేటస్‌కి మాత్రం నోచుకోలేదు. ప్రస్తుతం మెగాస్టార్ ‘ఆచార్య’తో తిరిగి టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్ అవుతాననే ధీమా వ్యక్తం చేస్తుందీ భామ. 

Advertisement
Advertisement
Advertisement