Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 06 Jul 2022 16:35:58 IST

Mega Heroes పొంగల్ దంగల్ ?

twitter-iconwatsapp-iconfb-icon

2022 సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు ఏమంతగా బరిలోకి దిగగపోవడంతో ఆ సీజన్ చప్పగా సాగింది. అందుకే ఆ లోటును 2023లో తీర్చేందుకు బడా హీరోలు సంక్రాంతి పర్వదినాన తమ సినిమాలతో బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే కొంతమంది హీరోలు సంక్రాంతి సీజన్‌కు రిలీజ్ డేట్స్‌ను లాక్ చేసుకొనే పనిలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఈ రేస్‌లో మెగా హీరోలు కూడా వార్‌కు రెడీ అవుతున్నారని సమాచారం అందుతోంది. ఇప్పటికే మెగా కాంపౌండ్ నుంచి పొంగల్ దంగల్ కు సిద్ధమవుతున్నానని మెగాస్టార్ చిరంజీవి తన 154వ చిత్రంతో హింటిచ్చారు. రిలీజ్ డేట్ ప్రకటించకపోయినప్పటికీ.. సంక్రాంతికి వస్తున్నట్టు ప్రకటించడంతో మెగాభిమానులు ఇప్పటినుంచే ఆసక్తిగా ఉన్నారు. ఇంకా పవర్ స్టార్, మెగాపవర్ స్టార్ కూడా తమ సినిమాలతో రంగంలోకి దిగబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ జానపద చిత్రం ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 17వ శతాబ్దంలో జరిగే పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతోంది. నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ కథానాయికలుగా నటిస్తున్నారు. కొంతకాలంగా వరుసగా బ్రేకులు పడుతూ సాగుతోంది ఈ సినిమా షూటింగ్. వీలైనంత త్వరగా పూర్తిచేసి వచ్చేనెల సంక్రాంతికి బరిలోకి దింపాలని క్రిష్ ప్లాన్. సంక్రాంతికి ఇంకా టైమ్ ఉండడంతో బ్యాలెన్స్ షూట్ ను త్వరగా కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్టే కుదిరితే.. హరిహర వీరమల్లు సంక్రాంతి బరిలోకి దిగడం ఖాయం.

ఇక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ .. శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాన్ని కూడా సంక్రాంతి రేస్ లో నిలపడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. RC 15గా పిలుచుకుంటున్న ఈ సినిమా దిల్ రాజ్ ప్రొడక్షన్స్ లో 50వ చిత్రంగా విశేషాన్ని సంతరించుకుంది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఆర్.ఆర్.ఆర్ చిత్రం తర్వాత చెర్రీ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా, సునీల్, జయరామ్, శ్రీకాంత్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తమిళ నటుడు యస్.జే సూర్య విలన్‌గా నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. మరి నిజంగానే 2023 సంక్రాంతికి మెగా హీరోల వార్ ఉంటుందో లేదో చూడాలి.  

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement