Abn logo
May 30 2020 @ 23:19PM

మెగా, మహేష్ ఫ్యాన్స్ హ్యాపీ.. కానీ నందమూరి, ప్రభాస్ ఫ్యాన్సే..?

అభిమానులను ఆనంద పెట్టేందుకు స్టార్ హీరోలు ఎంతగా కష్టపడుతుంటారో అందరికీ తెలిసిందే. 6 ‌ప్యాక్‌లు, 8 ప్యాక్‌లు ఇవన్నీ అభిమానుల కోసమే. దర్శకనిర్మాతలు కూడా అభిమానులను సంతోష పెట్టేందుకు ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ వేడుకలు వంటివి చేస్తుంటారు. స్టార్ హీరోలందరూ తమ అభిమానులు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే అనుకుంటారు. కానీ కొన్నిసార్లు పరిస్థితులు అభిమానులను హర్టయ్యేలా చేస్తుంటాయి. ఇంకొన్నిసార్లు అభిమానులే వారి హీరోలను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతుంది ఇదే.


అయితే ఈ విషయంలో మెగా, మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందంగా ఉంటే.. నందమూరి, ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం చాలా ఆవేశంతో ఉన్నారు. ఒకరి ఆనందానికి, మరొకరి ఆవేశానికి కారణం కేవలం హీరోల సినిమాల గురించి అప్‌డేట్సే. రామ్ చరణ్ బర్త్‌డే రోజు ‘ఆర్ఆర్ఆర్’ నుంచి విడుదల చేసిన స్పెషల్ వీడియో మెగాభిమానులను ఆనందపరిస్తే, అల్లు అర్జున్ పుట్టినరోజున ‘పుష్ప’ అప్‌డేట్‌తో మరోసారి మెగాభిమానుల ఆనందం డబుల్ అయ్యింది. ఇక మహేష్ బాబు విషయంలో అభిమానుల కాస్త నిరాశ పరిచినప్పటికీ, ఘట్టమనేని అభిమానులకు ఎంతో ప్రత్యేకమైన రోజున మహేష్ సినిమా అప్‌డేట్ రాబోతుండటంతో వారు కూడా హ్యపీ. 

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు. ఆయన బర్త్‌డే రోజు ‘ఆర్ఆర్ఆర్’ నుంచి స్పెషల్ ఏదైనా ఉంటుందని ఆలోచించి అభిమానులు భంగపడ్డారు. ఈ విషయంలో వారు చాలా నిరాశకు లోనయ్యారు. ఇక ప్రభాస్ అభిమానుల సంగతి తెలియంది కాదు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాకు సంబంధించి ఏదైనా అప్‌డేట్ ఇవ్వమని.. డైరెక్ట్‌గా నిర్మాణ సంస్థనే టార్గెట్ చేశారు. ‘సాహో’ తర్వాత ప్రభాస్ నుంచి సరైన అప్‌డేట్ లేకపోవడంతో.. ఆయన అభిమానులంతా ఎంతో నిరాశతో ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement