జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీతో ముగిసిన ఉద్యోగ సంఘాల భేటీ

ABN , First Publish Date - 2021-11-11T21:20:08+05:30 IST

జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్‌తో ఉద్యోగ సంఘాల ప్రతినిధుల

జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీతో ముగిసిన ఉద్యోగ సంఘాల భేటీ

అమరావతి: జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్‌తో ఉద్యోగ సంఘాల ప్రతినిధుల భేటీ ముగిసింది. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ వెంటనే పీఆర్సీ నివేదికను బయటపెట్టాలని కోరామన్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని సభ్య సంఘాల మెంబర్‌షిప్ వివరాలు కూడా కోరామన్నారు. సీఎంఓ అధికారులతో పీఆర్సీ నివేదికపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. పీఆర్సీ నివేదికను ఇప్పుడే ఇవ్వలేమని శశిభూషణ్ చెప్పారని ఆయన పేర్కొన్నారు. తన చేతుల్లో ఏం లేదని, సీఎం, సీఎస్ చేతుల్లోనే అంతా ఉందని ఆయన చెప్పారని బండి తెలిపారు. రెండు జేఏసీలు కలిసినప్పుడు వెంకట్రామిరెడ్డిని కూడా తమతో కలవాలని కోరామన్నారు. భేషజాలు పక్కన పెట్టాలని చెప్పామని ఏపీ జేఏసీ చైర్మన్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. 


 


మరో ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతోందన్నారు. పీఆర్సీ నివేదికను తామూ స్టడీ చేయాలన్నారు. తమ డిమాండ్లు నివేదికలో ఉన్నాయో, లేవో తమకు తెలియాలి కదా అని ఆయన ప్రశ్నించారు. ఎవరేం విమర్శలు చేసినా తాము పట్టించుకోమని అమరావతి జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు స్పష్టం చేసారు. 



Updated Date - 2021-11-11T21:20:08+05:30 IST