Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీడీపీ స్ట్రాటజీ కమిటీ భేటీ

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన స్ట్రాటజీ కమిటీ భేటీ అయింది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగిందని చంద్రబాబు విశ్లేషించారు. ప్రజల్లో వైసీపీ పాలన పట్ల విపరీతమైన వ్యతిరేకత ఉందని, దీనికి మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఓట్ల శాతమే నిదర్శనమని నేతలు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార బలం, అరాచకాలతోనే వైసీపీ గెలిచిందని, ఇది శాశ్వతం కాదని ఆలపాటి రాజా అన్నారు. మహిళలను కించపరిచేలా అసెంబ్లీలో వైసీపీ నేతల వ్యవహరిస్తున్న తీరును గౌరవ సభల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. ఓటీఎస్ ద్వారా పేదల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న తీరును ఎండగట్టాలని క్షేత్ర స్థాయి పర్యటనలకు ప్రణాళికలు సిద్దం చేసుకోవాలన్నారు.


రాజధాని రైతుల పాదయాత్రను ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని నేతలు తెలిపారు. సంఘీభావం తెలిపినా కేసులు పెడుతున్నారని చంద్రబాబు దృష్టికి సోమిరెడ్డి తెచ్చారు. డ్యామ్ గేట్లకు గ్రీజే పెట్టలేకపోయిన సీఎం జగన్.. మూడు రాజధానుల నిర్మాణం ఏం చేస్తారంటూ భేటీలో చంద్రబాబు సెటైర్లు వేశారు. ఈ నెల 17వ తేదీన పాదయాత్ర ముగింపు సందర్భంగా రైతుల నిర్వహించే బహిరంగ సభతోనైనా సీఎం జగన్ కళ్లు తెరవాలన్నారు. ప్రభుత్వ అవినీతిని, నేతల దందాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్న మరో నాయకుడు చిన రాజప్ప సూచించారు. 


Advertisement
Advertisement